By: ABP Desam | Updated at : 11 Jan 2023 08:16 PM (IST)
Edited By: jyothi
జల్సాల కోసం అర్ధరాత్రి దొంగతనాలు - అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
Warangal Crime News: విలాసవంతమైన జీవితం కోసం ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో మోటార్ సైకిళ్లే లక్ష్యంగా చోరీలు చేసే అతడు చాలా సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు. తాజాగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేశాడు. ఓ ఇంటి తాలం పగులగొట్టి 5 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ఫోన్ దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కష్టపడి నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి తండ్రి చంద్రయ్య మందమర్రిలోని సింగరేణి బొగ్గు గనులలో పని చేస్తున్నాడు. నిందితునికి ఏడుగురు అన్నదమ్ములు కూడా ఉన్నారు. అయితే ఇతడు మాత్రం చిన్నతనం నుంచే బడి మానేసి ఆవారాగా తిరుగుతూ బెల్లంపల్లిలో మోటార్ సైకిళ్లను దొంగలించగా బెల్లంపల్లి పోలీసులు పట్టుకొని జువైనల్ హోంకు తరలించారు. ఆ తర్వాత జువైనల్ హోం నుంచి బయటకు వచ్చినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ లోని జైల్లో శిక్ష అనుభవించాడు. వరంగల్ జైలులో ఉండగా రామకృష్ణపూర్ పోలీసులు ఇతనిపై పీడి యాక్ట్ కూడా నమోదు చేశారు. అన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించి నవంబర్ 18వ తేదీ 2022రోజు జైలు నుంచి బయటకు వచ్చాడు.
ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ వెళ్లిన సదరు నేరస్థుడు నవంబర్ 21వ తేదీ 2022 రోజున అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉన్న హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. దొంగలించిన మోటార్ సైకిల్ పై డిసెంబర్ నెల మొదటి వారంలో వరంగల్ కు వచ్చి శివనగర్ ఏరియాలో తిరుగుతూ.. అర్ధరాత్రి ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి అక్కడ కూడా చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అయిదే ఇంటి తాళం పగులగొట్టిన నిందితుడు.. లోనికి ప్రవేశించి బీరువా తెరచి అందులోని ఉన్న డబ్బులతో పాటు వివో సెల్ ఫోన్ ను దొంగలించుకొని పారిపోయినట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
వరంగల్ పోలీసుల ప్రత్యేక నిఘా..
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అడిషినల్ డీసీపీ క్రైమ్స్ మరియు ఆపరేషన్స్ పుష్ప, క్రైమ్ ఏసీపీ డేవిడ్ రాజు స్వీయ పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస రావు, ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి ఐటీ కోర్ సల్మాన్ పాషా సహకారంతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలనే బూడిదగడ్డ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. నిందితుడు TS 20 9627 నంబరు గల హీరో గ్లామర్ మోటార్ సైకిల్ పై వచ్చాడు. అతడిని పోలీసులు ఆపుతుండగానే.. నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలనే పోలీసులు అతడిని వెంబడించి మరీ పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఓ మోటార్ సైకిల్ తో పాటు వివో మొబైల్ ఫోన్, 5000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్
Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, కూలీలపై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి!
Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?
Guntur Crime : గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు- కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, 50 గొర్రెలు చోరీ
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్
BRS Nanded Meeting : నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !
Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ
Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?