By: ABP Desam | Updated at : 07 Dec 2022 11:48 AM (IST)
Edited By: jyothi
రైలుకు దిగబోయి కిందపడ్డ విద్యార్థిని, రైలు మధ్య ఇరుక్కొని నరకం!
Visakha Train Accident: విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రైలు దిగబోతుండగా ఓ యువతి ప్రమాదవశాత్తు జారి పడింది. దీంతో రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అమ్మాయిని అందులోంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో కూలీలను రప్పించి ప్లాట్ ఫాంను పగులగొట్టారు. ఇలా అమ్మాయిని బయటకు తీశారు. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన యువతి పేరు శశికళ. ప్రస్తుతం ఆమె దువ్వాడ విజ్ఞాన కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. గోపాలపట్నం నుంచి వస్తున్న ఆమె రైలు దిగే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఏడు నెలల క్రితం శ్రీకాకుళం రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగడంతో గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ట్రాక్ పై దిగారు. కొందరు ప్రయాణికులు పట్టాలు దాటుతున్న సమయంలో విశాఖ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జి.సిగడాం-చీపురుపల్లి మధ్య జరిగిన రైలు ప్రమాదంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తక్షణమే స్పందించారు. ఆర్.డి.ఓ, తహశీల్దార్ ను ప్రమాద స్థలానికి హుటాహుటిన వెళ్లాలని ఆదేశించారు. అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందిని కూడా కలెక్టర్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ ను ప్రమాద స్థలానికి పంపినట్లు తెలిస్తోంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే..?
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు నుంచి సిల్చెర్ వెళ్తున్న గువాహటి ఎక్స్‌ప్రెస్ చీపురు పల్లి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగి రైలు ఆపేశారు. కొందరు కిందకు దిగి పట్టాలపై నిల్చున్నారు. ఇదే సమయంలో భువనేశ్వర్ నుంచి విశాఖ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకొచ్చి పట్టాలపై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది
మృతుల్లో ఇద్దరు అస్సాంకు చెందినవారుగా గుర్తించారు. మిగిలిన వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ఇతను ఒడిశా రాష్ట్రంలోని బ్రహ్మపుర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ ప్రాంతమంతా చిమ్మచీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తు న్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లర్కర్ సహాయక చర్యల్లో పాల్గొనాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
నెల్లూరు పోలీసులకు షాకిచ్చిన దొంగ- వాగులోకి దూకి పరారీ
Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా
Hyderabad Crime: చైన్ స్నాచింగ్స్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్, చోరీలకు కారణం ఏంటంటే !
Kotamreddy Vs Corporator : నెల్లూరు రూరల్ లో వార్ స్టార్ట్, కోటంరెడ్డి బెదిరిస్తున్నారని కార్పొరేటర్ ఫిర్యాదు
Kadapa Crime : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్, బ్యాంక్ అకౌంట్లలో కోటికి పైగా నగదు చోరీ
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
SBI Q3 Result: రికార్డ్ సృష్టించిన స్టేట్ బ్యాంక్, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు