అన్వేషించండి

Vikarabad Crime: భార్య అందంగా లేదని భర్త వేధింపులు, విషాదాంతమైన ప్రేమ పెళ్లి!

భార్య అందంగా లేదని వేధింపులకు దిగాడో ప్రబుద్ధుడు. ఈ వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే ఆ దారుణానికి పాల్పడ్డాడు.

ప్రేమించానన్నాడు, జీవితాంతం తోడై ఉంటానన్నాడు. ఆ మాటలు నమ్మిన యువతి పెళ్లికి ఒప్పుకుంది. పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి(Marriage) చేసుకున్నారు. జీవితాంతం అండగా ఉంటానని మాటలు చెప్పి తీరా పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు గడవకముందే తన భార్య అందంగా లేదంటూ వేధింపులకు దిగాడు. భర్త వేధింపులు తట్టుకోలేని ఆ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. జిన్గుర్తి గ్రామానికి చెందిన మహేష్ యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత (23)ను ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు సజావుగా జరిగిన వీరి కాపురంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ చిన్న తగాదాలు పెద్దవయ్యాయి. 

Vikarabad Crime: భార్య అందంగా లేదని భర్త వేధింపులు, విషాదాంతమైన ప్రేమ పెళ్లి!

మహేష్ తన భార్యను అందంగా లేవంటూ నువ్వు చనిపోతే మరో వివాహం చేసుకొని దర్జాగా ఉంటానంటూ వేధించేవాడని సునీత బంధువులు ఆరోపిస్తున్నారు. మహేష్ సునీతను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవాడని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తట్టుకోలేని సునీత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. తన చెల్లెలు మహేష్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలు సునీత సోదరి అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కరణ్కోట్ పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Vizianagaram: ప్రియురాలి రెండేళ్ల కూతురిపై లవర్ పైశాచికత్వం - బుగ్గలు, కాళ్లు కొరికేసి, తల్లి చేసిన పని షాక్

భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్య

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని గంపలగూడెం మండలం అనుమల్లంక గ్రామానికి చెందిన నాగబత్తిన నాగేంద్రబాబుకు కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన భాగ్యమ్మ (27)తో 8 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగేంద్రబాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భాగ్యమ్మకు అనుమానం వచ్చింది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో భాగ్యమ్మ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

Also Read: Vijayawada Crime: బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా, ప్రియుడి అరెస్టుతో గుట్టురట్టు

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
Ganja Transport For Lover Birthday Gift: ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ ప్రియుడు
ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయిన ప్రియుడు
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Devotional Thief: దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !
దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget