(Source: ECI/ABP News/ABP Majha)
Vijayawada GGH Incident : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు అత్యాచారం!
Vijayawada GGH Incident : విజయవాడ జీజీహెచ్ దారుణ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది.
Vijayawada GGH Incident : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)లో దారుణ ఘటన జరిగింది. మతిస్థిమితం లేని యువతిపై ఒప్పంద ఉద్యోగి దాష్టీకానికి ఒడిగట్టాడు. మాయమాటలు చెప్పి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు, ఆస్పత్రిలో తన స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితంలేని యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగిరాకపోయే సరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నున్న పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం యువతిని జీజీహెచ్ గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నున్న పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాయి.
జీజీహెచ్ ముందు ప్రతిపక్షాల ఆందోళన
నున్న పోలీసు స్టేషన్ ముందు సీపీఎం నేతలు ఆందోళన చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సీపీఎం నేత బాబురావు ఆరోపించారు. విజయవాడ జీజీహెచ్ లో జరిగిన ఘటనతో ప్రభుత్వ వైఫల్యం ఉందని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. నగరం నడిబొడ్డున యువతిపై ముగ్గురు నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడితే పట్టించుకునే నాథుడే లేరన్నారు. మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు అయితే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. దిశా చట్టం ఉన్నా, కఠినంగా అమలు చేయడం లేదని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ జీజీహెచ్ ముందు సీపీఎం, టీడీపీ, మహిళా సంఘాల నేతలు ఆందోళన చేశాయి.
ఈ ఘటనపై దిశ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జీజీహెచ్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read : First Night Fear : శోభనం భయంతో ఆత్మహత్య - తల్లి, ఫ్రెండ్స్ ఎంత ధైర్యం చెప్పినా !?