అన్వేషించండి

Crime News: వామ్మో ఈమె మామూలు మహిళ కాదు - పెళ్లి చేసుకుంటుంది తర్వాత దోచేస్తుంది, ఏకంగా ఆరుగురిని పెళ్లాడి ఏడో పెళ్లికి సిద్ధమవుతుండగా!

Eternal Bride: ఒంటరి పురుషులనే ఆ ముఠా టార్గెట్ చేస్తుంది. పెళ్లైన అనంతరం అదును చూసి ఆ యువతి డబ్బు, నగలతో ఉడాయిస్తుంది. ఇలా ఏకంగా ఆరుగురిని పెళ్లాడి చివరకు పోలీసులకు చిక్కింది.

UP Police Arrested Eternal Bride: ఒంటరి పురుషులే ఆమె టార్గెట్. ఓ ముఠాగా ఏర్పడి వారికి గాలం వేస్తుంది. చిక్కుకున్న వారిని పెళ్లి చేసుకుంటుంది. తనే సర్వస్వం అని నమ్మిస్తుంది. కొద్దిరోజులు కాపురం చేసిన అనంతరం నగలు, డబ్బు తీసుకుని ఉడాయిస్తుంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురిని తన టాలెంట్‌తో మోసం చేసింది. ఎట్టకేలకు ఏడో వ్యక్తిని సైతం మోసం చేసేందుకు యత్నించగా అనుమానంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్య పెళ్లి కూతురి వ్యవహారం బట్టబయలైంది. టీమ్‌తో సహా నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనమ్, సంజనా గుప్తా, విమలేశ్ శర్మ, ధర్మేంద్ర ప్రజాపతి వీరంతా ఓ టీమ్. వీరిలో పెళ్లికూతురు పూనమ్, సంజనా ఆమె తల్లి. మిగిలిన ఇద్దరు సంబంధాల కోసం వెతుకుతారు. వీరు పెళ్లి కోసం ఎదురు చూసే ఒంటరి పురుషులు ఎక్కడ దొరుకుతారా.? అని టార్గెట్ చేస్తారు. అలాంటి వారికి గాలం వేసి అమ్మాయిని చూపిస్తామని.. అందుకు రూ.1.50 లక్షలు ఫీజుగా చెల్లించాలని అంటారు. అవతలి వారు అందుకు ఒప్పుకోగానే పూనమ్, సంజనల వద్దకు తీసుకెళ్తారు. వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికీ పెళ్లి చేస్తారు.

అదును చూసి..

పెళ్లైన అనంతరం పూనమ్ పెళ్లికొడుకుతో అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ అవకాశం ఉండే వరకూ అతనితో కాపురం చేస్తుంది. అవకాశం చిక్కగానే ఇంట్లో దొరికిన నగలు, డబ్బు తీసుకుని పరారవుతుంది. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌ బాందా జిల్లాకు చెందిన శంకర్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిని సదరు ముఠా టార్గెట్ చేసింది. సంజన, పూనమ్ తీరుపై అనుమానం రావడంతో.. రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో పూనమ్ ముఠా అతన్ని బెదిరించింది. తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది. దీంతో తనకు ఆలోచించుకోవడానికి టైం కావాలని చెప్పి అతను అక్కడి నుంచి బయటపడ్డాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

Also Read: VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vikarabad Road Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget