(Source: ECI/ABP News/ABP Majha)
TSRTC: హైదరాబాద్ శివారులో కలకలం- ఆర్టీసీ బస్‌పై దుండగల దాడి- సజ్జనార్ సీరియస్ వార్నింగ్
Bus Attack: హైదరాబాద్ శివారులో తెలంగాణ ఆర్టీసీ బస్సుపై ఆకతాలు దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. దీనిపై ఎండీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం స్టేషన్‌లో కేసు పెట్టారు.
Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని దుండుగలు దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. బైక్‌పై వచ్చిన దుండగులు....కదులుతున్న బస్సు( TS RTC) పై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోగా...అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. హైదరాబాద్(Hyderabad) శివారులోని రాచలూరు గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆర్టీసీ బస్సుపై దాడి
హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద ఆకతాయిలు తెలంగాణ ఆర్టీసీ బస్సు( TS RTC) పై దాడికి పాల్పడ్డారు. కల్వకుర్తి(Kalvakurthy) డిపోనకు చెందిన బస‌్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులకు ఏమీకాలేదు. దాడికి కారణాలు ఏంటో తెలియలేదు. ఇది ఆకతాయిల పనేనా...లేక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో ఆ యువకులు ఏమైనా గొడవపడ్డారో తెలియలేదు. అయితే దుండగులు దాడిలో బస్సులోని ప్రయాణికుల చాలా భయపడ్డారు. ఒక్కసారిగా కదులుతున్న బస్సుపై యువకులు కేకలు వేసుకుంటూ దాడి చేయడంతో భయాందోళనకు గురయ్యారు. ఇంకా ఏమైనా చేస్తారేమనని ఆందోళన చెందారు. అయితే డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు కదిలించడంతో కొంతదూరం వెంటపడిని యువకులు ఆ తర్వాత వెళ్లిపోయారు.
ఈ బస్సు మీ అందరిదీ
తెలంగాణ ఆర్టీసీ బస్సుపై దాడి ఘటనను ఎండీ సజ్జనార్(Sajjanar) ఖండించారు. ఆర్టీసీ బస్సు ప్రజలందరి ఆస్తి అని...దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ(TS RTC) యాజమాన్యం ఏమాత్రం సహించదన్నారు. ఆర్టీసీ బస్సుపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న సజ్జనారు.... ఈ ఘటనపై రాచకొండ(Rachakonda) కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం(Maheswaram) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని...త్వరలోనే నిందితులు దొరుకుతారన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని... బస్సు డ్యామేజీ ఖర్చులను వారి నుంచే వసూలు చేస్తామని హెచ్చరించారు.