అన్వేషించండి

Tirupati Crime News: మద్యం తాగి కారులోనే నిద్రపోయారు - మళ్లీ లేవలేదు - డోర్లు వేసుకుంటే గాలి ఎలా ఆడుతుంది ?

Tirupati: తిరుపతిలో కారులో మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. డోర్లు మూసుకుని నిద్రపోవడంతో వారికి గాలి ఆడలేదని గుర్తించారు.

Tirupati Two people died in Car : ఆ ఇద్దరు అన్నదమ్మలు కారులో మద్యం తాగారు. ఎవరికీ కనిపించకుండా ఉండాలని కారుపై టార్పాలిన్ కప్పుకున్నారు. మద్యం  తాగిన తర్వాత ఇద్దరూ కారులోనే నిద్రపోయారు కానీ మళ్లీ లేవలేదు. డోర్లు వేసేసుకోవడం..  డోర్ గ్లాసులు కూడా కిందకు దింపకపోవడంతో వారికి గాలి ఆడలేదు. దాంతో ప్రాణాలు కోల్పోయారు. 

తిరుచానూరు రంగనాథ రోడ్డులో  ఈ ఘటన జరిగింది. దిలీప్ అనే యువకుడు, అతని బాబాయ్ కుమారుడు వినయ్‌లు రోడ్డు పక్కన నిలిపి ఉన్న తమ కారులో మద్యం తాగుదామని ప్లాన్ చేసుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా సిట్టింగ్ కారులో పెట్టుకున్నారు.  రోడ్డు పక్కనే కారు ఉంది కాబట్టి ఎవరైనా చూస్తారేమోనని కారుపై టార్పాలిన్ కప్పుకున్నారు. ఏసీ వేసుకుని.. డోర్లు క్లోజ్ చేసుకున్నరాు. ఫుల్లుగా మద్యం తాగి.. కారులోనే పండుకున్నారు. కార్ ఇంజిన్ స్టార్ట్ చేసి.. ఏసీ ఆన్ చేసుకున్నారు. దాంతో సమస్య ఉండదని అనుకున్నారు. కానీ పెట్రోల్  అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది. మద్యం మత్తులో నిద్రపోతున్న వారికి విషయం అర్థం కాలేదు. 

క్రమంలో వారికి గాలి ఆడలేదు. అది తెలియనంత మద్యం మత్తులో వారు ఉన్నారు. చివరికి గాలి ఆడకచనిపోయారు. తిరుచానూరు పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఎస్‌వీ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు.    కారు కిటికీలు మరియు డోర్లు పూర్తిగా మూసివేసి ఉంటే, గాలి ఆడే అవకాశం ఉండదు. దీనివల్ల కారులో ఉన్న ఆక్సిజన్ క్రమంగా తగ్గిపోతుంది.  కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి.  ఊపిరితో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ కారులోనే చేరడంతో, ఆక్సిజన్ అందక మెదడు, తర అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి, దీనివల్ల ఊపిరాడక మరణం సంభవిస్తుంది.
 
కారు ఇంజన్ రన్ అవుతున్నప్పుడు  కార్బన్ మోనాక్సైడ్ (CO) విడుదలవుతుంది. ఈ వాయువు రంగులేని, వాసనలేని విషవాయువు. ఇది శరీరంలో ఆక్సిజన్‌ను రక్తం ద్వారా రవాణా చేసే హిమోగ్లోబిన్‌తో సులభంగా కలిసిపోతుంది.  కిటికీలు మూసివేసి ఉంటే, ఈ వాయువు కారులో చేరి, శరీరంలో ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది. దీనివల్ల తలనొప్పి, మైకము, స్పృహతప్పడం,  చివరికి మరణం సంభవిస్తుంది.    తిరుచానూరు ఘటనలో, కారు ఇంజన్ ఆగిపోయినప్పటికీ, ఇంజన్ రన్ అయిన సమయంలో విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ కారులో చేరి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఒక సాధారణ కారు లోపల ఆక్సిజన్ సరఫరా సీల్డ్ వాతావరణంలో గంటల వ్యవధిలో తగ్గిపోతుంది. ఇద్దరు వ్యక్తులు శ్వాసించడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరిగి, ఆక్సిజన్ 21% నుంచి 16% కంటే తక్కువకు పడిపోతే, స్పృహ కోల్పోవడం, మరణం సంభవించవచ్చు. కారు ఇంజన్ నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ 0.1% (1000 ppm) కంటే ఎక్కువ సాంద్రతలో ఉంటే, కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవించవచ్చు. కారు సీల్డ్ వాతావరణంలో ఉంటే, ఈ వాయువు త్వరగా చేరుతుంది. తిరుచానూరు  ఘటనలో, కారు ఇంజన్ పెట్రోల్ అయిపోవడంతో ఆగిపోయింది. అయితే, ఇంజన్ రన్ అయిన సమయంలో విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ లేదా ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మరణం సంభవించి ఉండవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget