అన్వేషించండి

Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన

వికారాబాద్ జిల్లా లక్ష్మీ నారాయణపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గుంతలోకి బైకు దూసుకుపోవడంతో, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు.

యాలాల: డ్యూటీకి వెళ్తున్న కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో విషాదం నెలకొంది. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని లక్ష్మీ నారాయణపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నర్సింలు (30) అనే పోలీస్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదం ఎలా జరిగింది..

లక్ష్మీ నారాయణపూర్ వద్ద జాతీయ రహదారిపై ప్రస్తుతం ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. అయితే, మార్గమధ్యంలో కానిస్టేబుల్ నర్సింలు నడుపుతున్న టూ వీలర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న ఆ బ్రిడ్జి గుంతలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. లారీ స్కూటీని బలంగా ఢీకొన్న ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు వారి కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్ గ్రామానికి చెందిన పావని (35), ఆమె భర్త కవిరాజ్ (40) తమ పిల్లలు కీర్తన (11), కార్తీక్ (13)తో కలిసి జహీరాబాద్‌లో నివసిస్తున్నారు. మే ఒకటో తేదీన జరగనున్న పావని సోదరుడి వివాహం కోసం వీరంతా ఆదివారం తమ స్వగ్రామం రుక్మాపూర్‌కు వెళ్లి, తిరిగి వస్తుండగా తట్టెపల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పావని, కవిరాజ్, కీర్తన దుర్మరణం చెందగా, కుమారుడు కార్తీక్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Vizianagaram Crime News: పురుగుల మందు తెచ్చి ఇచ్చి లవర్ బ్లాక్ మెయిల్.. నిశ్చితార్థానికి ముందే యువతి ఆత్మహత్య
పురుగుల మందు తెచ్చి ఇచ్చి లవర్ బ్లాక్ మెయిల్.. నిశ్చితార్థానికి ముందే యువతి ఆత్మహత్య
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget