Kedar Selagamasetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం - దుబాయ్‌లో యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూత.. ఆయన మృతిపై పొలిటికల్ వార్
Kedar Selagamsetty Died: టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. అక్కడి పోలీసులు విచారిస్తున్నారు.

Tollywood Producer Kedar Selagamsetty Died: టాలీవుడ్ యువ నిర్మాత కేదర్ సెలగంశెట్టి (42) (Kedar Selagamsetty) మంగళవారం దుబాయ్‌లోని (Dubai) తన అపార్ట్‌మెంట్‌లో ఆకస్మికంగా కన్నుమూశారు. తొలుత దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ అనంతరం పలు మీడియా సంస్థల ఆయన మరణాన్ని ధ్రువీకరించాయి. దుబాయ్‌లో సినీ ఫైనాన్షియర్ కుమారుడి వివాహ వేడుకలు జరుగుతుండగా.. ప్రీ వెడ్డింగ్ వేడుకలో స్నేహితులతో కలిసి కేదార్ పాల్గొన్నారు. పార్టీ తర్వాత ప్లాట్‌కు వచ్చి నిద్రపోయారు. అనంతరం విగతజీవిగా కనిపించారని అతని స్నేహితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆయన అనారోగ్యంతోనే చనిపోయారా.? లేదా మరేదైనా కారణమా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. ఆనంద్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన 'గం గం గణేశా' మూవీ ఆయన నిర్మించిందే. ఆయన మృతిపై పలువురు టాలీవుడ్ నిర్మాతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నిద్రించిన ప్లాట్‌లోనే తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా బస చేసినట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేను దుబాయ్ పోలీసులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
కేదార్ మృతిపై రాజకీయ దుమారం
మరోవైపు, కేదార్ మృతిపై రాజకీయ దుమారం రేగుతోంది. సరిగ్గా ఏడాది క్రితం గచ్చిబౌలి పరిధిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు ఇచ్చిన కొకైన్ పార్టీకి కేదార్‌తో పాటు.. పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి కేదార్‌ను ఏ4 నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా కేదార్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలున్నాయి. సినీ నిర్మాతగా కాక ముందు ఆయన ఓ పబ్ నిర్వహించేవారని తెలుస్తోంది. దుబాయ్‌లో కేదార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. దీనిపై కేటీఆర్ ఎందుకు వివరణ కోరడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేదార్ కేటీఆర్ బిజినెస్ పార్టనర్ అని ఆరోపించారు. కేదార్ మృతి చెందిన హోటల్‌లోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని.. తన వ్యాపార భాగస్వామి మరణంపై కేటీఆర్ కోరితే తాము తప్పకుండా విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే కేదార్ మృతదేహాం ఇండియాకు రానుందని తెలిపారు.
Also Read: 'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

