Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణం, నెలరోజులుగా వివాహితను ఇంట్లో బంధించి అత్యాచారం
Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజుల పాటు వివాహితను బంధించి అత్యాచారాని పాల్పడ్డాడో వ్యక్తి.
Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ వివాహితను నాగరాజు అనే వ్యక్తి రెండు ప్రాంతాల్లో నిర్బంధించి నెల రోజులు పాటు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివాహిత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తిరిగి వివాహిత నివసిస్తున్న గ్రామంలో వదిలి పెట్టాడు.
అసలేం జరిగింది?
తిరుపతి జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఓ వివాహిత తిరుపతి రూరల్ మండలంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. తిరుపతిలోని ఓ పాఠశాలలో పనిచేస్తోంది. అయితే చిగురువాడ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నవంబర్ 17న వివాహిత పని చేస్తున్న పాఠశాల వద్దకు వెళ్లాడు. వివాహితకు బ్యాంకు లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, బలవంతంగా బైక్ పై తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన వివాహిత నాగరాజును ప్రతిఘటించడంతో నాగరాజు ఆమెపై దాడి చేశాడు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పాకాల మండలం దామలచెరువులోని ఓ ఇంట్లో నిర్బంధించాడు. మళ్లీ పలుమార్లు అత్యాచారం చేశాడు. వివాహిత చనిపోతానని చెప్పడంతో భయపడ్డ నాగరాజు ఆమెను స్వగ్రామంలో వదిలిపెట్టాడు.
మహిళ ఆత్మహత్యాయత్నం
మానసికంగా కుంగిపోయిన వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అడ్డుకుని ధైర్యం చెప్పారు. గ్రామస్తులు సహకారంతో జనవరి 6న తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది వివాహిత. ఎస్పీ దిశ పోలీసులకు కేసును బదిలీ చేశారు. డీఎస్పీ రామరాజు కేసుపై నిర్లక్ష్యం వహించి, నిందుతుడిపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో బాధితురాలు బంధువుల సహాయంతో డీఎస్పీని వేడుకున్నా ఏమాత్రం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం చేయాలని దళిత సంఘాలు నేతలతో కలిసి చంద్రగిరిలో మీడియాతో గోడు చెప్పుకున్నారు.
యూపీని వణికిస్తున్న సీరియల్ కిల్లర్
యూపీలోని బరబంకి ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. మహిళలనే టార్గెట్ చేస్తూ హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ అక్కడే తిరుగుతున్నాడని తెలిసి భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఆరు పోలీస్ బృందాలు కిల్లర్ కోసం గాలిస్తున్నాయి. సోషల్ మీడియాలో నిందితుడి ఫోటో షేర్ చేశారు. గుర్తించిన వారెవరైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు చెప్పారు. ఇప్పటికే ముగ్గురు మహిళలను దారుణంగా చంపేశాడు నిందితుడు. గతేడాది డిసెంబర్ 5న అయోధ్య జిల్లాలో ఖుషేటి గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఏదో పని మీద బయటకు వచ్చింది. సాయంత్రం మళ్లీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు పెట్టారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు...డిసెంబర్ 6న ఓ చోట ఆమె మృతదేహం కనిపించింది. శరీరంపై బట్టలు లేవని, ముఖంపై తీవ్రంగా గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అయితే...ఆ మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఆ తరవాత కొద్ది రోజులకే...బరబంకిలో మరో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈమెను కూడా అత్యాచారం చేసిన చంపినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడించింది. డిసెంబర్ 30న తతర్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళనూ ఇదే విధంగా హత్య చేశాడు సీరియల్ కిల్లర్. ఈ కేసుని విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్‌ను తొలగించి...మరో అధికారిని నియమించారు. బరబంకి ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు.