అన్వేషించండి

Gujarat: కుమార్తె పెళ్లి రోజే తుపాకీతో కాల్చుకుని తండ్రి ఆత్మహత్య - ఆర్థిక ఇబ్బందులు కాదు డబ్బులు ఎక్కువయ్యే!

Surat: సూరత్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి తుషార్ ఘేలానీ తన కుమార్తె పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి ఎంత బాగా చేయాలన్నదానిపై కుటుంబంలో వివాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Surat builder dies  on daughter wedding day : గుజరాత్‌లోని సూరత్‌లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి  తుషార్ ఘేలానీ   తన కుమార్తె పెళ్లి రోజే మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వివాహ వేడుకలు జరగాల్సిన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
  
 జోలీ  బ్రాండ్ పేరుతో సూరత్‌లో అనేక నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించిన తుషార్ ఘేలానీకి ఫిబ్రవరి 5న తన కుమార్తె తన్వి వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 1వ తేదీన వివాహ ఖర్చులు ,  అతిథుల జాబితా విషయంలో కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులకు కొదవ లేకపోవడంతో అత్యంత భారీగా పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే ఈ అంశంపై కుటుంబంలో తీవ్రమైన వివాదాలు రావడంతో   తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
  
తుషార్ ఘేలానీని వెంటనే స్థానిక మహావీర్ ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ మెదడులోకి దూసుకుపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు శస్త్రచికిత్స చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం వైద్యులు ఆయనను బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. ఈ కష్టకాలంలోనూ ఆయన కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. తుషార్ అవయవాలను దానం చేయడానికి అంగీకరించింది.
  
కుమార్తె పెళ్లి జరగాల్సిన ఫిబ్రవరి 5 ఉదయం అవయవాల సేకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు  రావడంతో ఆస్పత్రి బెడ్‌పైనే మరణించారు. దీనివల్ల కాలేయం, చేతుల దాన ప్రక్రియ సాధ్యపడలేదు, కేవలం ఆయన కళ్లను మాత్రమే సేకరించగలిగారు. పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో సూరత్ వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది. 

తుషార్ ఘేలానీ సూరత్ క్రెడాయ్ మాజీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కుమార్తె పెళ్లి కోసం విదేశాల నుంచి వచ్చిన బంధువుల మధ్యే ఈ ఘోరం జరగడం అందరినీ కలచివేసింది. ఉమ్రా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget