Crime News: తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు - కదిరిలో ఘటన, ఫేక్ అని స్పష్టం చేసిన పోలీసులు
Andrha News: తల్లి ఫోన్ కొనివ్వలేదని ఓ కుమారుడు ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటన సత్యసాయి జిల్లా కదిరిలో జరిగింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
![Crime News: తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు - కదిరిలో ఘటన, ఫేక్ అని స్పష్టం చేసిన పోలీసులు son attacked his mother in kadiri due to not given phone it was fake Crime News: తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు - కదిరిలో ఘటన, ఫేక్ అని స్పష్టం చేసిన పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/12/f9d872d27a2fd758c5fb7b5c436d03ba1734006035971876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Son Murdered Mother In Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో (Kadiri) దారుణం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. తల్లి ఫోన్ ఇవ్వలేదని ఓ కుమారుడు తల్లిపై కత్తితో దాడి చేశాడనే ప్రచారం సాగుతోంది. ఫ్రీ పైర్ గేమ్ ఆడుతున్న సమయంలో మధ్యలో ఫోన్‌లో డేటా అయిపోయిందని తల్లిని మొబైల్ ఇవ్వమని అడిగితే ఆమె గొంతుపై కత్తితో దాడి చేశాడనేది ఆ వార్త సారాంశం. దీనిపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. కదిరి టౌన్‌లో ఇలాంటి సంఘటనేదీ జరగలేదని తెలిపారు. అది ఫేక్ అని అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
బైక్ కొనివ్వలేదని..
అటు, చిన్నపాటి విషయాలకే కొందరు మనస్తాపంతో ప్రాణాలు తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఓ యువకుడు బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో ఇనుప తాళాలు మింగేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. తనకు బైక్ కావాలని భవానీ ప్రసాద్ అనే యువకుడు ఇంట్లో వాళ్లతో గొడవపడి 4 తాళాలు మింగేశాడు. ఈ క్రమంలో తీవ్ర కడుపునొప్పి రాగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాప్రోస్కోపీ విధానంతో ఎలాంటి సర్జరీ లేకుండా కడుపులో ఉన్న 4 తాళాలను చాకచక్యంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం యువకుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
Also Read: Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)