అన్వేషించండి

Crime News: రంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం- తండ్రి, బంధువును హత్య చేసిన యువకుడు

Rangareddy District Crime News: కుటుంబ తగాదాలతో ఓ యువకుడు తన తండ్రిని, సమీప బంధువును దారుణంగా నరికి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పీఎస పరిధిలో ఈ దారుణం జరిగింది.

Double Murder in Rangareddy District: మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలు ఇద్దరి ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పరిధి బాబుల్‌రెడ్డి నగర్‌లో శనివారం సాయంత్రం జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. మద్యానికి బానిసై నిత్యం గొడవ పడుతున్న తండ్రిని, గొడవ అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువుని ఓ యువకుడు హత్య చేశాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పరిధి బాబుల్‌రెడ్డి నగర్‌లో లక్ష్మీనారాయణ కుటుంబం నివాసం ఉంటోంది. అతడు మద్యానికి బానిసయ్యాడు. చాలా ఏళ్ల నుంచి మద్యం సేవించి తరచుగా భార్యతో గొడవ పడేవాడు. పిల్లలను సైతం వేధించేవాడు. ఈ మధ్య వేధింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట వారి ఇంటిని అమ్మాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో రూ.20 లక్షల వరకు తనకు ఇవ్వాలని భార్యతో లక్ష్మీనారాయణ శనివారం సాయంత్రం గొడవకు దిగాడు. కుటుంబసభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
అసలే మద్యం సేవించి నిత్యం గొడవకు దిగే అలవాటున్న లక్ష్మీనారాయణ(55).. భార్య తనకు అడిగినంత వాటా డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా భార్యపై దాడికి పాల్పడ్డాడు. మొదట కుమారుడు తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. అతడిపై సైతం లక్ష్మీనారాయణ దాడికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం అమ్మను కొడతావా, గొడవ వద్దంటే నాపై దాడి చేస్తావా అంటూ కుమారుడు ఆగ్రహావేశానికి లోనయ్యాడు. ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి తండ్రిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అడ్డుకునేందుకు సమీప బంధువు (మేనమామ శ్రీనివాస్ (60)) ప్రయత్నించగా అతడిపై సైతం ఆయుధంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఆ యువకుడు. ఆ ఏరియా వాళ్లు అడ్డుకుని వారించే ప్రయత్నం చేసినా, వారి నుంచి విడిపించుకుని వెళ్లి మరీ ఇద్దర్నీ నరికి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరగడంతో ఈ జంటల హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. తండ్రి తాగొచ్చి నిత్యం వేధించేవాడని లక్ష్మీనారాయణ కుమార్తె పోలీసులకు తెలిపింది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు యువత జీవితాన్ని నాశనం చేస్తాయని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు.
 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
‌Fake Currency Racket: హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్
Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
Shivasattu Murder: చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
Embed widget