అన్వేషించండి

Bride kidnapped: రంగారెడ్డి జిల్లాలో పెళ్లి కూతురు కిడ్నాప్‌ కలకలం, ఇంటిపై 100 మంది యువకులు దాడి !

Dental Doctor Kindapped in Rangareddy District: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటి రాగన్నగూడలో పెళ్లి కూతూరు కిడ్నాప్ సంచలనంగా మారింది.

Dental Doctor Kindapped in Rangareddy District: రంగారెడ్డి జిల్లాలో యువతి కిడ్నాప్‌ కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటి రాగన్నగూడలో పెళ్లి కూతూరు కిడ్నాప్ సంచలనంగా మారింది. దాదాపు 100 మంది యువకులు తమ ఇంటికి వచ్చి కుమార్తెను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. కొందరు గుర్తుతెలియని యువకులు ఇంటిపై దాడి చేసి, ఇల్లు పూర్తిగా ధ్వంసం చేశారని, వీరిని అడ్డుకునేందుకు చూసిన వారిపై సైతం దాడి చేసి యువతిని కిడ్నాప్ చేశారని సమాచారం. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటి రాగన్నగూడలోని ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు సంతోషంగా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. అంతలో ఏం జరిగిందో తెలియదు.. సినిమా సీన్ తరహాలో కొందరు యువకులు డెంటల్ కోర్సు చేస్తున్న యువతి ఇంటికి చేరుకున్నారు. రావడంతోనే తమ చేతిలో ఉన్న కర్రలు, రాడ్లతో యువతి ఇంటి వద్ద ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. బంధువులు, చుట్టు పక్కల ఇళ్లవారు ఆ గుర్తుతెలియని యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి చేసి గాయపరిచారు. యువతిని బలవంతంగా కిడ్నాప్ చేసి తమ వాహనాల్లో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. 

యువతి తల్లిదండ్రులు ఏమన్నారంటే..
తమ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతుండగా టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి అనే యువకుడు కొందరు యువకులతో వచ్చి తమ ఇంటిపై దాడి చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు డెంటల్ కోర్సు చేస్తుందని, కొందరు యువకులు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేసి బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తల్లిదండ్రుల ఆరోపించారు. తన కూతుర్ని కిడ్నాప్‌ చేసింది నవీన్ రెడ్డి అనే యువకుడని, ఎలాగైనా కూతుర్ని కిడ్నాపర్ల చెర నుంచి కాపాడాలంటూ బాధిత యువతి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.  డెంటర్ డాక్టర్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిశీలించారు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కిడ్నాపర్ ను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. నిందితుల వివరాలు, సమాచారం కోసం ఆ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Fake High Court Judge: హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget