అన్వేషించండి

Ramagundam Crime : రామగుండం మర్డర్ కేసులో సంచలనాలు, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Ramagundam Crime : రామగుండంలో సింగరేణి కార్మికుడి మర్డర్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించింది భార్య. అంతకు ముందు కరెంట్ షాక్ ఇచ్చి, కారుతో యాక్సిడెంట్ చేయించి హత్య చేయాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Ramagundam Crime : రామగుండం మర్డర్ కేసులో పోలీసులు అసలు కారణాలు వెలికితీశారు. ఏకంగా తుపాకీ వాడి ఓ సింగరేణి కార్మికుడిని హత్య చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట పకడ్బందీగా ప్లాన్ వేసి తమ టార్గెట్ ను ఫినిష్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంటి లోపల నిద్రిస్తున్న వ్యక్తిని అంత కచ్చితంగా గుర్తించి ఎలా చంపారు? అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.  

అసలేం జరిగింది? 

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళితో ఏడేళ్ల క్రితం కొరకు కొప్పుల రాజేందర్ వివాహం జరిగింది. అయితే మొదటి నుంచి రాజేందర్ తో తరచూ గొడవలు పడిన రవళి దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటామంటూ చెబుతుండేది. అయితే ఆమెకు మరో వ్యక్తితో సాహిత్యం ఉన్నట్లు గుర్తించి పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ మధ్య జరిగిన పంచాయితీలో తాను ఇతర భర్త చెప్పినట్లు నడుచుకుంటానని రవళి అంగీకరించింది. తన తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఇష్టం లేదంటే వేరు కాపురం పెట్టాడు రాజేందర్. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు రాజేందర్.  శ్రీరాంపూర్ ప్రాంతంలో పనిచేస్తూనే భార్యాపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. అయితే శుక్రవారం డ్యూటీ ముగించుకొని వచ్చిన రాజేందర్ ఇంట్లో నిద్రించుచుండగా తెల్లవారుజామునే ఇద్దరు వ్యక్తులు రాజేందర్ ని పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అసలు అంత రాత్రి సమయంలో రాజేందర్ ను గుర్తించడం, ఇంటి తలుపులు ఎవరు తీశారనే అనుమానాలు మొదలయ్యాయి. పకడ్బందీగా ప్లాన్ చేస్తే కానీ పది నిమిషాల్లో ఈ వ్యవహారాన్ని పూర్తి చేయలేరని  ఇంటి దొంగల హస్తం ఉంటుందని పోలీసులు అనుమానించారు. రాజేందర్ హత్య చేయడానికి ఏకంగా తుపాకీని వాడడంతో పోలీసులు సైతం ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. వీధిలోని సీసీ టీవీ కెమెరాలో నిందితులు వచ్చి వెళ్తోన్న విజువల్స్ చాలా స్పష్టంగా కనిపించాయి. హెల్మెట్ పెట్టుకుని గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారని రవళి పోలీసులకు చెప్పింది. అన్నీ విన్న పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. 

Ramagundam Crime : రామగుండం మర్డర్ కేసులో సంచలనాలు, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

మూడో ప్రయత్నంలో భర్తను చంపిన రవళి 

రవళితో పాటు రాజేందర్ తల్లిదండ్రులను సైతం విచారించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. అమాయకంగా కనిపించే ఆమె ఒక క్రిమినల్ కి ఏ మాత్రం తీసిపోకుండా రాజేందర్ ని చంపించడానికి ప్లాన్ వేసింది.  ఒకసారి తమ ఇంట్లో గేట్ కి కరెంట్ పాస్ అయ్యిందని, అప్పుడు రాజేందర్ కు షాక్ కొట్టిందని దీని వెనకాల రవళి కుట్ర ఉందని రాజేందర్ తల్లిదండ్రులు అనుమానించారు. అయితే అప్పట్లో వారి మాటలు ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్య రాజేందర్ ను ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చంపించాలని ప్లాన్ చేసిందని, అయితే అది కూడా విఫలం కావడంతో తమ కుమారుడు బతికి బయటపడ్డాడని రాజేందర్ తల్లిదండ్రులు అంటున్నారు. రెండు సార్లు విఫలమవ్వడంతో ఎట్టిపరిస్థితుల్లో అతని ప్రాణం తీయాలని భావించిన రవళి తన ప్రియుడు రాజు అతని మిత్రుడు సయ్యద్ లతో కలిసి ఒక ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే తుపాకీతో కాల్చి చంపితే రాజేందర్ బతికి బట్ట కట్టే అవకాశం లేదని వారికి వివరించడంతో బిహార్ నుంచి తుపాకిని కొనుగోలు చేశారు. ఇక హత్య చేసిన రోజు రాత్రి తలుపు తీసి ఉండడంతో నేరుగా వచ్చిన దుండగులు రాజేందర్ తలపై గురి పెట్టి మరి కాల్చారు. దీంతో అక్కడికక్కడే రక్తం మడుగులో రాజేందర్ ప్రాణాలు కోల్పోయాడు. 

Also Read : శిల్పకళావేదికలో మునావర్ స్టాండప్‌ కామెడీ- బయట బీజేపీ శ్రేణులతో హైటెన్షన్

Also Read : సింగరేణిలో పేలిన తుపాకీ- పరుగులు పెడుతున్న పోలీసులు

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget