News
News
X

Rajasthan Crime News: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హత్య చేయించిన భర్త, అనుమానం రాకుండా ప్లాన్

Rajasthan Crime News: రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేయించాడు.

FOLLOW US: 
Share:

Rajasthan Crime News:

సుపారీ ఇచ్చి మరీ హత్య..

ఇన్సూరెన్స్ కోసం భార్యను చంపించాడు ఓ భర్త. సుపారీ ఇచ్చి మరీ ఓ రౌడీషీటర్‌తో హత్య చేయించాడు. బైక్‌పై వెళ్తుండగా..కార్‌తో గుద్దించి హతమార్చాడు. ఈ దారుణం రాజస్థాన్‌లో జరిగింది. షాలు అనే మహిళ తన తమ్ముడితో కలిసి బైక్‌పై ఆలయానికి వెళ్తుండగా...ఓ కార్ వచ్చి బలంగా ఢీ కొట్టింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందగా...ఆమె బంధువుకి తీవ్ర గాయాలయ్యాయి. భర్త మహేశ్ చంద్...బైక్‌పై వెళ్లాలని మరీమరీ చెప్పడం వల్ల ఈ ప్రమాదానికి, అతనికి ఏమైనా సంబంధం ఉండొచ్చని మృతురాలి తరపున బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలీసులు విచారణ చేపట్టగా..తన భార్య పేరుమీదున్న రూ.1.90కోట్ల ఇన్సూరెన్స్ అమౌంట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు.. తానే ఈ హత్య చేయించినట్టు భర్త అంగీకరించాడు. అంతకు ముందు తానే తన భార్య పేరు మీద కోటి రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు. సహజంగా మరణిస్తే రూ.కోటి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా ప్రమాదంలో చనిపోతే రూ.కోటి 90 లక్షలు క్లెయిమ్ చేయొచ్చని కంపెనీ పాలసీలో ఉంది. ముకేష్ సింగ్ రాథోడ్ అనే ఓ రౌడీ షీటర్‌కు ఈ పని అప్పగించాడు. ఈ పని చేసేందుకు అతను రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ముందుగానే రూ.5.5 లక్షలు చెల్లించాడు. ఇదంతా పోలీసుల విచారణలో తేలింది. చంద్, షాలుకి 2015లో వివాహమైంది. ఓ పాప కూడా ఉంది. కానీ..పెళ్లైన రెండేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. షాలు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. 2019లో తన భర్తపై గృహ హింస కేసు కూడా పెట్టింది. 

పక్కా ప్లాన్ ప్రకారం..

ఉన్నట్టుండి చంద్..తన భార్య పేరిట కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించాడు. సమస్యలన్నీ తీరిపోవాలంటే 11 రోజుల పాటు బైక్‌పై హనుమాన్ ఆలయానికి వెళ్లాలని చెప్పాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని జాగ్రత్త పడ్డాడు. తాను బలంగా ఓ కోరిక కోరుకుంటున్నానని, అది తీరిపోగానే ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఇది నమ్మిన ఆమె రోజూ తన కజిన్‌తో కలిసి ఆలయానికి వెళ్లేది. అక్టోబర్ 5న ఎప్పటిలాగే బైక్‌పై వెళ్తుండగా...ఓ కార్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ఆ కార్ వెనకాలే చంద్‌ ఓ బైక్‌పై ఫాలో చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ప్రమాదం జరగ్గానే అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయాడు. ఈ కేసులో చంద్ రాథోడ్‌తో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలా ఇన్సూరెన్స్ కోసం హత్య చేయడం చాలా సాధారణమైపోయింది. ఎక్కడో ఓ చోట ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉంటున్నారని హత్యలు చేయడమూ కామన్ అయిపోయింది. రోజూ ఏదో ఓ చోట ఇలాంటి దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

Also Read: Kashmiri Pandits: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో కశ్మీరీ పండిట్‌లకు అవకాశం! త్వరలోనే కేంద్రం ప్రకటన?

Published at : 01 Dec 2022 03:40 PM (IST) Tags: Rajasthan crime news Rajasthan Crime Man kills his wife Insurance Money

సంబంధిత కథనాలు

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు

BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు

Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి

Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!