అన్వేషించండి

Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు

Anantapuram News: అనంతపురం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా తీవ్రం చేశారు. డ్రోన్లు చూసిన మందుబాబులు పరుగులు పెట్టారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Police Found Drinkers With Drones In Anantapuram: గంజాయి బ్యాచ్, మందుబాబులు, బ్లేడ్ బ్యాచ్ ఇలా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఏపీ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం సేవించి ఎంజాయ్ చేస్తామనుకునే వారికి డ్రోన్లతో (Police Drones) షాక్ ఇస్తున్నారు. ఆ సమయానికి అక్కడ తప్పించుకున్నా విజువల్స్ సాయంతో వెతికి మరీ పట్టుకుంటున్నారు. తాజాగా, అనంతపురం (Anantapuram) జిల్లాలోని శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. బహిరంగంగా జూదం ఆడడం, లిక్కర్ సేవించడం, గంజాయి, కొట్లాటలు వంటి వాటిపై సీరియస్‌గా ఫోకస్ చేశారు. పోలీస్ డ్రోన్లను చూసిన ఆకతాయిలు ఒక్కసారిగా పరుగందుకున్నారు. బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించిన వారిపై 4 కేసులు నమోదు చేశారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. డ్రోన్లను చూసి మందుబాబులు పరుగులెత్తిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కేవలం అనంతపురం జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయి ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ఎస్పీ అమిత్ బర్దార్.. సిబ్బందితో వెళ్లి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. డ్రోన్ సాయంతో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించి 5 ఎకరాల్లో సాగు చేస్తోన్న వెయ్యి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అటు, విజయవాడ పోలీసులు సైతం విస్తృతంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. నగర సీపీ ఎస్.వి.శేఖర్ బాబు ఆధునిక పరిజ్ఞానం సాయంతో 'లైవ్ డ్రోన్ ఇంటిగ్రేటెడ్ టు కమాండ్ కంట్రోల్' ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు ఇస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం అప్‌డేటెడ్ వెర్షన్ కలిగిన ఎయిర్ 3 డ్రోన్లను 3 విధాలుగా ఉపయోగిస్తున్నారు. కాగా, విజయవాడ వరదల సమయంలోనూ పోలీసులు డ్రోన్లను సహాయక చర్యల నిమిత్తం విస్తృతంగా ఉపయోగించారు.

Also Read: Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget