అన్వేషించండి

Hathras Stampede: యూపీలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోర విషాదం - తొక్కిసలాటలో 116 మంది మృతి

Hathras Stampede News: ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం జరిగింది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Hathras stampede death: ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాథ్రస్ (Hathras) జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తోపులాట జరగ్గా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఇప్పటివరకూ అధికారిక లెక్కల ప్రకారం 116 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే  పోలీసులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఇటా ఆస్పత్రికి తరలించారు. రతీభాన్‌పూర్‌లో శివారాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లారు. దీంతో ఒక్కసారి తోపులాట జరిగి దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఘటనపై దర్యాప్తునకు ఆదేశం

ఈ దుర్ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తోందని కలెక్టర్ ఆశీష్ కుమార్ తెలిపారు. 'ఇప్పటివరకూ 87 మంది వరకూ మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఈ విషాదం చోటు చేసుకుంది' అని పేర్కొన్నారు.

ఇప్పటివరకూ పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారని.. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నట్లు ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ త్రిపాఠి వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని అన్నారు.

రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హాథ్రాస్‌లో అధిక సంఖ్యలో భక్తులు మరణించడం తీవ్ర బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

అమిత్ షా దిగ్భ్రాంతి

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. 

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'యూపీలోని హాథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. ఇందులో తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. బాధితులకు ప్రభుత్వం యంత్రాంగం అన్ని విధాలా సహాయం చేస్తోంది.' అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget