Crime News: జూనియర్‌పై లైంగిక దాడి, ఆపై హత్య చేసిన సీనియర్స్.. అంతా మైనర్లే
మదర్సాలో ఐదుగురు మైనర్లు కలిసి తమ జూనియర్‌పై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఆపై డెడ్‌బాడీని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు.

Boy Assault In Madrasa: ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. ఐదుగురు మైనర్లు కలిసి తమ జూనియర్‌పై లైంగిక దాడికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశారు. ఆపై డెడ్‌బాడీని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు. అంతకుముందు సైతం సదురు బాలుడిపై ఇలాంటి దారుణానికే పాల్పడగా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడిపై ఆ తర్వాత కూడా హత్యాచారానికి పాల్పడి మత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందే ఒకసారి హత్యాయత్నం
పోలీసుల వివరాల ప్రకారం.. నీలపల్లిలోని మదర్సాలో కటక్ జిల్లాకు చెందిన ఓ బాలుడు చదువుతున్నాడు. అదే క్యాంపస్‌లో చదివే ముగ్గురు సీనియర్ స్టూడెంట్లు ఆగస్టు 31న రాత్రి 10 గంటలకు బాలుడిని బాత్రూమ్లో దారుణంగా కొట్టి అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు చనిపోయాడని భావించి అతడిని సెప్టింక్ ట్యాంక్‌లో పడేసి వెళ్లిపోయారు. అయితే బాధిత బాలుడు ఎలాగోలా తప్పించుకున్నాడు.
అయితే ఆ బాలుడిని హాస్టల్ నుంచి తప్పిస్తామని నమ్మించిన ఇద్దరు స్టూడెంట్లు సెప్టెంబర్ 2న మళ్లీ అదే ప్రాంతానికి తీసుకెళ్లారు. మరో ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై హత్య చేసి మళ్లీ సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు.
ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాలుడు అదృశ్యమైనట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైనట్లు గుర్తించి బాలుడి డెడ్‌బాడీని సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి బయటకు తీశారు. ఫోరెన్సిక్ బృందం ఎవిడెన్స్ సేకరించిందని, నిందితులైన ఐదుగురు బాలురను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. వారంతా 12 నుంచి 15 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. విచారణలో తామే నేరం చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
జువైనల్ బోర్డు ముందుకు కేసు
నిందితులైన విద్యార్థుల పేర్లను రికార్డుల నుంచి తొలగించినట్లు మదర్సా అడ్మినిస్ట్రేషన్ తొలగించింది. వారి బర్త్ సర్టిఫికెట్లను సైతం స్వాధీనం చేసుకుంది. ఈ కేసును జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ఉంచారు. ఈ బోర్డు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.





















