News
News
X

Nizamabad: బాన్సువాడలో వివాహిత మిస్సింగ్, కట్ చేస్తే UPలో మర్డర్ - దిమ్మతిరిగే లవ్ స్టోరీ!

ఓ పెళ్లైన మహిళ గుడ్డిగా నమ్మేసి ఓ వ్యక్తి కోసం రాష్ట్రాలు దాటేసి వెళ్లిపోయింది. చివరికి అతణ్ని కలుసుకుంది. మొత్తానికి అతని చేతిలోనే శవంగా మారింది.

FOLLOW US: 

Facebook Love: ఓ ఆన్ లైన్ పరిచయం మరో ఘోరమైన నేరానికి దారి తీసింది. గతంలో ఎన్నో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినా ఓ పెళ్లైన మహిళ గుడ్డిగా నమ్మేసి ఓ వ్యక్తి కోసం రాష్ట్రాలు దాటేసి వెళ్లిపోయింది. చివరికి అతణ్ని కలుసుకుంది. మొత్తానికి అతని చేతిలోనే శవంగా మారింది. ఆమె నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నుంచి ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో హతురాలు తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఉస్మా బేగం అనే 32 ఏళ్ల పెళ్లైన మహిళగా గుర్తించారు. యూపీలోని గజరౌలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చెక్‌మేట్‌ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో మూడు రోజుల కిందట మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు శనివారం హత్య మిస్టరీని ఛేదించారు.

అయితే, ఆ వివాహితకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమె వెళ్లిపోవడానికి కారణం భర్తతో గొడవలు జరిగి ఉండడమే అని నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ పోలీసులు తెలిపారు. 

ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నిందితుడు షెహజాద్‌ను తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేయడంతో ఫేస్‌బుక్‌ ప్రేమ కథ మొత్తం బయటపడింది. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లా ఎస్పీ ఆదిత్య లంగే మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. బాన్సువాడకు చెందిన ఉస్మాన్ బేగంకు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన షెహజాద్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. అది ప్రేమగా మారింది. ఆయన్ను కలిసేందుకు ఈ నెల నవంబరు 6న బాన్సువాడలోని తన ఇంటి నుంచి బయలుదేరిన ఉస్మా బేగం అతడి సూచన మేరకు గజరౌలా చేరింది. షెహజాద్‌ను కలుసుకుంది. ఆమె పెళ్లి చేసుకొందామని ఒత్తిడి తెచ్చింది. దీంతో సహనం కోల్పోయిన షెహజాద్‌ ఓ తుండుతో ఆమెను కట్టేసి, ఇటుకతో కొట్టాడు. తలపై చితకబాదడంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత అతను పని చేసే కంపెనీ ఆవరణలో ఓ మూలన యువతి మృత దేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.

బాన్సువాడలో మిస్సింగ్ కేసు నమోదు

News Reels

ఉస్మా బేగం తన భర్త ముఖీద్‌తో కలిసి బాన్సువాడలో నివాసం ఉంటుంది. ఉస్మా బేగం ఈ నెల 6న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఇంతలోనే యూపీలో ఉస్మా బేగం హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు సమాచారం అందింది. 12 ఏళ్ల కిందట బాన్సువాడకు చెందిన ముఖీద్‌తో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి మధ్య మనస్పర్ధలు రావటంతో 2 నెలలు నిజామాబాద్‌లో ఉంది. పెద్దలు రాజీ చేయడంతో ఈ నెల 4న బాన్సువాడకు కాపురానికి వెళ్లింది. తిరిగి రెండు రోజుల్లోనే అదృశ్యమై ఆ తర్వాత యూపీలో హత్యకు గురయింది. మృత దేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు ఉత్తర్ ప్రదేశ్ కు పంపారు.

Published at : 13 Nov 2022 10:10 AM (IST) Tags: facebook love Nizamabad News Uttar Pradesh banswada woman

సంబంధిత కథనాలు

Anantapur News : అనంతపురంలో శాంతించని తెలుగు తమ్ముళ్లు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన తోపుదుర్తి చందు

Anantapur News : అనంతపురంలో శాంతించని తెలుగు తమ్ముళ్లు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన తోపుదుర్తి చందు

Hyderabad News : హైదరాబాద్ లో భారీ మోసం - బొట్టు బిళ్లలు, వత్తుల పేరిట రూ.200 కోట్లు టోకరా!

Hyderabad News : హైదరాబాద్ లో భారీ మోసం - బొట్టు బిళ్లలు, వత్తుల పేరిట రూ.200 కోట్లు టోకరా!

Hyderabad News: కానిస్టేబుల్ కేటుగాడు- ఏడు ముఠాలకు హెడ్డు!

Hyderabad News: కానిస్టేబుల్ కేటుగాడు- ఏడు ముఠాలకు హెడ్డు!

Kona Seema District News: చర్చి కోసం కొట్టుకున్న పాస్టర్ల- మహిళపై కత్తితో దాడి!

Kona Seema District News: చర్చి కోసం కొట్టుకున్న పాస్టర్ల- మహిళపై కత్తితో దాడి!

Delhi Pandav Nagar Murder: దిల్లీలో మరో ఘోరం- భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య!

Delhi Pandav Nagar Murder: దిల్లీలో మరో ఘోరం- భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య!

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!