IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Nellore News : రక్తం కారుతున్నా, కారు అద్దాలు పగలగొట్టి మరీ చోరీ

Nellore News : నెల్లూరు జిల్లా ఆదూరుపల్లిలో దొంగతనం జరిగింది. పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలగొట్టి రూ.5 లక్షలు కొట్టేశాడు దొంగ.

FOLLOW US: 

Nellore News : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలో పార్కింగ్ చేసిన కారు నుంచి 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. గతంలో ఇలాంటి దొంగతనాలు అక్కడక్కడ జరిగే ఉంటాయి. కానీ ఈ దొంగతనం తీరే వేరు. కారు అద్దాలు పగలగొట్టే క్రమంలో ఆ దొంగ చేతికి గాయమైంది. గాయం తాలూకు రక్తం కూడా కారుకు అంటుకుంది. కానీ డబ్బు కోసం గాయాన్ని సైతం లెక్కచేయకుండా అనుకున్న పని సాధించి అక్కడినుంచి పరారయ్యాడు ఆ దొంగ. కారు కొనుగోలు కోసం పొద్దుటూరు నుంచి ఆదూరూపల్లి వచ్చిన ఖాదర్ భాష అనే వ్యక్తి అక్కడే భోజనం చేయడానికి ఆగాడు. భోజనం తర్వాత కారు డీల్ సెటిల్ చేసుకుందామనుకున్నారు. కారులోనే 5 లక్షల రూపాయల నగదు డ్యాష్ బోర్డ్ లో ఉంచాడు. తెలిసినవారి పనో లేక, ఎవరూ లేరని దొంగ ధైర్యం చేశాడో కానీ, మొత్తానికి కారు అద్దాలు పగలగొట్టి డ్యాష్ బోర్డ్ లోని క్యాష్ మాయం చేశాడు. దగ్గర్లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఏఎస్ఐ ఇంట్లో చోరీ 

దొంగల్ని పట్టుకునే పోలీసుల ఇంటికే కన్నం వేశాడో దొంగ. ఏకంగా ఏఎస్ఐ ఇంట్లోనే దొంగతనం చేశాడు. ఏఎస్ఐ ఇంట్లో నగదు, బంగారం అపహరించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌ రెడ్డి చెప్పిన కథనం ప్రకారం మీర్‌పేట మున్సిపాల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని విజయపురి కాలనీలో ఏఎస్ఐ శంకర్‌ ఉంటున్నారు. ఆయన ఛత్రినాక పోలీస్ స్టేషన్‌ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. 

కూతురు పెళ్లికి తెచ్చిన నగదు, నగలు మాయం

బుధవారం ఏఎస్ఐ శంకర్‌ బార్య ముడావత్‌ లక్ష్మి ఆమనగల్‌ మండలంలోని కలకొండలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లారు. శంకర్‌ గురువారం ఉదయం 10 గంటలకు డ్యూటీకి వెళ్లారు. ఆయన వెళ్లే సమయంలో కుమారుడు రాజేష్‌ ఇంట్లోనే ఉన్నారు. గురువారం మధ్యాహ్నం గం.1.30 లకు డ్యూటీ ముగించుకొని శంకర్‌ ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగలగొట్టి ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారరు. భార్య లక్ష్మి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 35 తులాల బంగారం, రూ.17 లక్షలు పోయినట్లు మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ ఫిర్యాదు చేశారు. అయితే న‌గ‌లు, న‌గ‌దు కూతురు పెళ్లి కోసం తీసుకువచ్చిన్నట్లు పోలీసులకు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీసీపీ సన్‌ ప్రీత్‌ సింగ్‌, ఏసీపీ పురుషోతం రెడ్డి, సీఐ మహేందర్‌ రెడ్డి, డీఐ భాస్కర్‌ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Published at : 29 Apr 2022 09:14 PM (IST) Tags: AP News Crime News Theft -Nellore news 5 lakh theft car

సంబంధిత కథనాలు

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి

UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి

Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Kakinada News :  డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు,  పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల

Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల