By: ABP Desam | Published : 23 Apr 2022 05:49 PM (IST)|Updated : 23 Apr 2022 06:10 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కెనరా బ్యాంకు నకిలీ బంగారం కేసు
Nandyala Crime : నంద్యాల జిల్లా శ్రీశైలం కెనరా బ్యాంకులో నకిలీ బంగారం వ్యవహారం ఇంటి దొంగల పనేనని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారుల ఖాతాల్లో నకిలీ బంగారం పెట్టి వాటిపై రూ. 80 లక్షలు కాజేశారని పోలీసులు గుర్తించారు.
నకిలీ బంగారం తాకట్టు పెట్టి
నంద్యాల జిల్లా శ్రీశైలంలో నకిలీ బంగారం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీశైలం కెనరా బ్యాంక్ మేనేజర్ శివనాగేశ్వరరావు, గోల్డ్ అప్రైజర్ కుమార్ ను పోలీసులు నిందితులుగా తేల్చారు. నకిలీ బంగారాన్ని కొందరి కస్టమర్లు అకౌంట్ల ద్వారా తాకట్టు పెట్టుకుని సుమారు రూ.80 లక్షల నగదును ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు కాజేశారని పోలీసులు తెలిపారు. కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ ఫిర్యాదుతో శ్రీశైలం కెనరా బ్యాంక్ మేనేజర్ శివనాగేశ్వరరావు, గోల్డ్ అప్రైజర్ కుమార్ ను అరెస్టు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరు పరిచామని సీఐ రమణ తెలిపారు. బ్యాంక్ నగదును రూ.80 లక్షల వరకు వారి స్వలాభాల కోసం నకిలీ బంగారాన్ని పలువురి అకౌంట్ల పేరుతో తాకట్టు పెట్టుకుని నగదును కాజేశారని తెలిపారు. ఈ కేసులో మోసం చేసిన నగదు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
Also Read : Cars Thief: పట్టుకోండి చూద్దామన్న దొంగకు పోలీసులు షాక్ - ఏకంగా 10 రాష్ట్రాల్లో కేసులు
ఇద్దరు అరెస్టు
"మార్చి 28వ తేదీన బ్యాంకు ఖాతాల్లో నకిలీ బంగారం పెట్టి రూ.80 లక్షలు ఫ్రాడ్ చేశారని కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో బ్యాంకు ఉద్యోగులు ఇద్దరిని అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులు సాక్ష్యాధారాలు, విచారణలో తేలిసిన నిజానిజాలతో బ్యాంక్ మేనేజర్, గోల్డ్ అప్రైజర్ ను అరెస్టు చేశాం. బ్యాంకు ఖాతాల్లో నకిలీ బంగారం పెట్టి రూ.80 లక్షలు మోసం చేశారు. బ్యాంకు అధికారుల నుంచి ఇంకా కొన్ని పత్రాలు అందాల్సి ఉంది. కేవలం గోల్డ్ లోన్ అకౌంట్లలో ఫ్రాడ్ రూ.80 లక్షలుగా తేలింది. ఇంకా బిజినెస్, పర్సనల్ అకౌంట్లలో మోసాలు జరిగాయని తెలుస్తోంది. బ్యాంక్ అధికారుల నుంచి మరింత సమాచారం రాగానే మొత్తం ఎంత నగదుతో తెలుస్తుంది. " అని సీఐ రమణ తెలిపారు.
Also Read : Palnadu District: అందరూ చూస్తుండగా పట్టపగలే కిడ్నాప్, మరుసటిరోజు ఉదయం శవమై కనిపించిన ఎగ్జిక్యూటివ్ !
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం
Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ
Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !
Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం