అన్వేషించండి

Nandyala Crime: వైసీపీ ఎంపీటీసీపై అత్యాచారయత్నం ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Nandyala Crime: వైసీపీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డిపై అత్యాచారయత్నం ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Nandyala Crime: వైఎస్సార్సీపీ నాయకుడిపై అత్యాచారయత్నం కేసు నమోదైంది. నంద్యాల జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డిపై పోలీసులు అత్యాచారయత్నం కేసు నమోదు చేశారు. అన్నవరం ఎంపీటీసీగా ఉన్న గోపాల్ రెడ్డి.. అత్యాచారయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాల్ రెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా అవుకు మండలం అన్నవరం ఎంపీటీసీగా ఉన్నారు. అంతే కాకుండా గోపాల్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఎంపీటీసీ గోపాల్ రెడ్డి బలగానపల్లె శాసన సభ్యుడు రామిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉంటారని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఓ వైసీపీ నాయకుడిపై అత్యాచారయత్నం కేసు నమోదు కావడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నాయకులు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని, వారి రౌడీయిజానికి సాధారణం జనం అల్లాడిపోతున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తారు. తప్పు చేసిన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని, అలాగే పదవుల నుంచి తొలగించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

నెల్లూరు జిల్లా కావలిలో రెచ్చిపోయిన వైసీపీ నేత!

నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీ డబ్బులు ఇంకా చెల్లించాలంటూ నలుగురితో కలిసి వచ్చి జులుం ప్రదర్శించాడు. తన అనుచరులతో మహిళపై దాడి చేయించాడు. వైసీపీ నేత మహేంద్రు దగ్గర కరకమిట్ల పార్వతి అనే మహిళ ఏడాది క్రితం రూ. 50 వేలు అప్పుగా తీసుకుంది. ఈ మొత్తానికి అసలుతో పాటు వడ్డీ కింద మరో రూ. 50 వేలు కూడా చెల్లించినట్లు పార్వతి చెబుతోంది. అయితే మరో రూ. 65 వేలు వడ్డీ డబ్బులు ఇంకా చెల్లించాలంటూ యువకులతో కలిసి వైసీపీ నేత దాడి చేయించాలని పార్వతి ఆరోపించారు. మహేంద్రు జులుంపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు వెళ్తే వాళ్లెవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో పార్వతి పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం  ఆస్పత్రిలో పార్వతి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం గురించి ఆమెను మీడియా ప్రశ్నించింది. వైసీపీ నేత మహేంద్రు తన అనుచరులతో వచ్చి తనపై దాడి చేయించాడని చెప్పుకొచ్చింది. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని, పోలీసులు కూడా మేం చెప్పినట్టే వింటారని, దిక్కున్న చోట చెప్పుకోమని మహేంద్రు దాడి చేశాడని పార్వతి బోరున విలపిస్తూ సమాధానమిచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పార్వతి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద వైసీపీ నేత మహేంద్రుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget