Crime News: పాలిస్తూనే కన్నబిడ్డ గొంతు పిసికి చంపిన తల్లి, కూతురు పుట్టిందన్న అసహనంతో హత్య
Crime News: మళ్లీ కూతురే పుట్టిందన్న అసహనంతో ఓ తల్లి పసికందుని గొంతు పిసికి చంపేసింది. కన్నబిడ్డకు పాలిస్తూనే దారుణంగా హత్య చేసింది.
Mother Kills Newborn Baby: మళ్లీ కూతురే పుట్టిందన్న అసహనంతో ఓ తల్లి కన్నబిడ్డను గొంతు పిసికింది చంపింది. పాలిచ్చే సమయంలోనే తన చేతులతోనే హతమార్చింది. అప్పటికే ముగ్గురు కూతుళ్లున్నారు. నాలుగో బిడ్డ కూడా అమ్మాయే కావడం వల్ల తీవ్ర అసహనానికి గురైంది. పాలిస్తూనే చంపేసింది. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఆ తల్లిపై హత్యా కేసు నమోదు చేసినట్టు వివరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...పోలీస్ స్టేషన్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆరు రోజుల చిన్నారి కనిపించడం లేదని చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ శిశువు తల్లితో మాట్లాడారు. అంతకు ముందు రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యానని, అక్కడి నేరుగా తల్లిగారింటికి వెళ్లాలని చెప్పింది.
రాత్రి పాలు ఇచ్చి పక్కనే పడుకోబెట్టుకున్నానని, తెల్లారి లేచి చూసే సరికి కనిపించ లేదని వివరించింది. అక్కడి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో ఆ తల్లి అక్కడి నుంచి హాస్పిటల్‌కి వెళ్లిపోయింది. కుట్లు తీయించుకోవాలని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంది. పోలీసులు తనిఖీలు చేయగా ఓ ఇంటి డాబాపైన బ్యాగ్ కనిపించింది. తెరిచి చూస్తే అందులో పసికందు ఉంది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ శిశువు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు గట్టిగా నిలదీశారు. చివరకు నేరాన్ని అంగీకరించింది. తానే చంపేశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు నలుగురు అమ్మాయిలు పుట్టారని, వాళ్లలో ఇద్దరు చనిపోయారని చెప్పింది. (Also Read: Viral Video: బైక్‌పైన షికార్లు చేస్తున్న భారీ మొసలి, వాహనదారులంతా షాక్ - వీడియో)
"ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు పుట్టి చనిపోయారు. ఆ తల్లి మానసిక ఆందోళనలో ఉంది. పాలిచ్చే సమయంలో ఏవేవో ఆలోచించి ఆ శిశువుని చంపేసింది. ఓ బ్యాగ్‌లో ఆ శవాన్ని పెట్టి పక్కనే ఉన్న డాబాపైన పడేసింది. కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో అర్థం కాక కనిపించడం లేదని చెప్పింది"
- పోలీసులు
Also Read: Viral News: అరుదైన గుర్రాలను గిఫ్ట్‌గా ఇచ్చిన పుతిన్, తెగ మురిసిపోతున్న కిమ్