అన్వేషించండి

అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా, తమ్ముడిని 8 సార్లు ట్రాక్టర్‌తో తొక్కి చంపిన అన్న

Rajasthan Crime: రాజస్థాన్‌లో ఓ అన్న ఆస్తితగాదాలో తమ్ముడిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడు.

Rajasthan Crime News:

రాజస్థాన్‌లో ఘోరం..

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. ఆస్తి వివాదంలో ఓ యువకుడిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడో వ్యక్తి. సొంత తమ్ముడిపై ట్రాక్టర్ ఎక్కించి బలవంతంగా 8 సార్లు తొక్కించాడు. టైర్ల కింద బాధితుడి శరీరం నుజ్జునుజ్జైంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా హత్యకు దారి తీసింది. ఏ మాత్రం బతికే అవకాశం లేకుండా చనిపోయాడని కన్‌ఫమ్ చేసుకునేంత వరకూ ట్రాక్టర్‌తో తొక్కించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. బహదూర్ సింగ్, అతర్ సింగ్ భరత్‌పూర్‌లోని ఓ స్థలంపై చాలా రోజులుగా తగాదా పడుతున్నారు. ఇవాళ ఉదయం (అక్టోబర్ 25) బహదూర్ సింగ్ కుటుంబం వివాదాస్పద స్థలం వద్దకు ట్రాక్టర్‌పై వెళ్లింది. ఆ తరవాత అతర్ సింగ్‌ కుటుంబమూ అక్కడికి చేరుకుంది. వచ్చీ రాగానే రెండు కుటుంబాలూ కర్రలతో కొట్లాడుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కొంత మంది తుపాకులతోనూ కాల్చినట్టు స్థానికులు చెబుతున్నారు. బులెట్ శబ్దాలు విపించినట్టు తెలిపారు. ఈ గొడవలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. ఇది గమనించిన వెంటనే అన్న ట్రాక్టర్‌తో మీదకి వెళ్లాడు. దాదాపు 8 సార్లు ముందుకు వెనక్కి వెళ్లి చనిపోయేంత వరకూ అలాగే తొక్కాడు. కుటుంబ సభ్యులు ఆపాలని ఎంత ప్రయత్నించినా పట్టించుకోకుండా కసితీర్చుకున్నాడు. ఈ ఘర్షణలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. 

రాజకీయ రచ్చ..

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 5 రోజుల క్రితమే ఈ రెండు కుటుంబాలు గొడవ పడ్డాయి. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఓ వర్గం వాళ్లు మరో వర్గంపై పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ఇక ఈ ఘటనలు పొలిటికల్ హీట్ పెంచాయి. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని పలువురు నేతలు మండి పడ్డారు. ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget