Jagadgirigutta: దారుణం - జగద్గిరిగుట్ట పరిధిలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం
Medchal News: మైనర్ పై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Man Harrased Minor Girl in Jeedimetla: మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల (Jeedimetla) జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మహిళతో సహజీవనం చేస్తోన్న ఓ వ్యక్తి ఆమె కూతురిపై అత్యాచారానికిి పాల్పడ్డాడు. గతంలో భర్త నుంచి విడిపోయిన బాధిత బాలిక తల్లి చంద్రశేఖర్ అలియాస్ సిద్ధుతో కలిసి సహజీవనం చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. వీరు తండ్రి వద్ద ఉండగా.. దసరా పండుగకు బాలిక.. తల్లి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ పలుమార్లు అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి వేధింపులు కొనసాగుతుండగా చివరకు తాళలేక బాలిక తల్లికి చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





















