Crime News: యువతిని 50 ముక్కలు చేసిన యువకుడు - కుక్క శరీర భాగాలు తింటుండగా వెలుగులోకి, ఝార్ఖండ్‌లో ఘోరం
Jharkhand Crime: ఓ వ్యక్తి తాను సహజీవనం చేస్తోన్న యువతిని చంపేసి ఆమె శరీరాన్ని 50 ముక్కలు చేసిన దారుణ ఘటన ఝార్ఖండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.

Man Brutally Murdered Live In Partner In Jharkhand: ఢిల్లీ శ్రద్ధావాకర్ దారుణ హత్య తరహాలోనే ఝార్ఖండ్‌లో (Jharkhand) మరో ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తోన్న యువతిని చంపి ఆమె శరీరాన్ని 50 ముక్కలు చేశాడు. వీధి కుక్క శరీర భాగాన్ని తింటుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖూంటీ జిల్లా జోర్దాగ్ గ్రామానికి చెందిన నరేష్ బెంగ్రా (25) అదే జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువతితో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ తమిళనాడులోనే ఉండేవారు. నరేష్ చికెన్ షాపులో పని చేసేవాడు. అయితే, కొన్ని రోజుల కిందట సొంత రాష్ట్రానికి వెళ్లిన నరేష్ అక్కడ మరో యువతిని పెళ్లి చేసుకుని తమిళనాడుకు తిరిగివచ్చాడు. దీంతో సహజీవనం చేస్తోన్న యువతి అతన్ని నిలదీసింది.
50 ముక్కలుగా నరికేశాడు
ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. ఈ నెల 8న ఇద్దరూ జోర్దాగ్ గ్రామానికి చేరుకున్నారు. నిందితుడు ఆమెను ఇంటికి కాకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం చున్నీ మెడకు బిగించి హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని 40 నుంచి 50 ముక్కలు చేసి అటవీ ప్రాంతంలో వేర్వేరు చోట్ల పడేశాడు. ఓ వీధి కుక్క మృతురాలి చేతిని తింటుండగా గ్రామస్థులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 24న దారుణం వెలుగుచూసింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Pune News In Telugu: పూణెలో దారుణం- క్రికెట్ గ్రౌండ్‌లో ఆడుతూ 35 ఏళ్ల క్రికెటర్ మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

