By: ABP Desam | Updated at : 21 Nov 2022 10:18 AM (IST)
Edited By: jyothi
నావేల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం - 45 వాహనాలను ఢీకొట్టిన ట్యాంకర్
Pune Road Accident: మహారాష్ట్రలోని పుణె నావేల్ బ్రిడ్ది సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వేగంగా వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి దాదాపు 45 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పుణె అగ్నిమాపక దళం, పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీల రెస్క్యూ బందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ సంఘటన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నావేల్ బ్రిడ్జ్ ప్రాంతంలో జరిగింది. అయితే ప్రమాదం కారణంగా ముంబయి వెళ్లే రహదారిపై రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Horrible Accident at Navale Bridge Pune .... minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ
— Nikhil Ingulkar (@NikhilIngulkar) November 20, 2022
పీఎంఆర్డీఏ అగ్నిమాపక దళానికి చెందిన అగ్నిమాపక అధికారి సుజిత్ పాటిల్ మాట్లాడుతూ: “ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ట్యాంకర్ బ్రేకు వైఫల్యం కారణంగా కనీసం 45 వాహనాలను ఢీకొట్టింది. దెబ్బతిన్న వాహనాల నుండి కొంతమంది గాయపడిన వ్యక్తులను.. స్థానికులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య మరియు వారి గాయాల స్వభావం మాకు తెలియదు. అగ్నిమాపక శాఖ నుండి రెస్క్యూ బృందాలు మరియు అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి". అని చెప్పుకొచ్చారు.
Unfortunate accident on Navale Bridge on #Pune-#Bengaluru Highway. Rescue teams from FireBrigade & PMRDA are on spot and tending to those injured.
— Siddharth Shirole (@SidShirole) November 20, 2022
I request citizens to not share un-verified forwards &also refrain from visiting the spot & interfering with trained professionals.
సిన్హాగడ్ రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయంత్ రాజుర్కర్ మాట్లాడుతూ.. “ట్రక్కు బ్రేక్ ఫెయిల్ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే తదుపరి పరీక్ష మాత్రమే దానిని నిర్ధారిస్తుంది. కనీసం 30 మందికి స్వల్ప గాయాలు య్యాయి. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రికి తరలించా." అని వివరించారు.
ట్రక్కు వేగంగా రావడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సుహైల్ శర్మ తెలిపారు. అయితే దెబ్బతిన్న వాహనాల్లో 22 కార్లు ఉన్నాయని వివరించారు. తీవ్ర గాయాలపాలైన ఆరుగురిలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పుకొచ్చారు. ముందుగా రోడ్డు ట్రాఫిక్ ను మళ్లించామని.. అయితే దెబ్బతిన్న వాహనాలను తొలగించామని వివరించారు. దెబ్బతిన్న వాహనాల నుంచి అధిక మొత్తంలో పెట్రోల్ బయటకు వచ్చి రోడ్డుపై పడిందని... దీన్ని కూడా శుభ్రం చేసిన తర్వాతే ట్రాఫిక్ సమస్యను తొలిగంచామని సుహైల్ శర్మ వెల్లడించారు.
Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి
Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం
Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య
LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్పీజీ సిలిండర్ మరింత భారం
Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!
/body>