అన్వేషించండి

Kothagudem: కొత్తగూడెంలో శవం మాయం, మిస్టరీగా వ్యవహారం - ఇలా బయటికొచ్చింది

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారిన ఈ సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

Kothagudem: వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లి విద్యుత్‌ తీగలకు తగిలి మృత్యువాత పడిన సునీల్‌ మృతదేహం ఎట్టకేలకు లభించింది. నాలుగు రోజుల పాటు పోలీసులు చేసిన విచారణ ఎట్టకేలకు సత్పలితాలను ఇచ్చింది. తాము పెట్టిన విద్యుత్‌ తీగలకు ఓ వ్యక్తి మృత్యువాతపడటంతో తమపై కేసు అవుతుందని భావించిన వారు ఏకంగా మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారిన ఈ సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం సన్యాసీబస్తీకి చెందిన మల్లెల సునీల్‌కుమార్, పాత కొత్తగూడెంకు చెందిన వెంకయ్య, రుద్రంపూర్‌కు చెందిన లావుడ్యా మున్నాలాల్‌ గత కొద్ది రోజులుగా పెనుబల్లి అటవీ ప్రాంతంలో తుపాకులతో వన్యప్రాణులను వేటాడేవారు. అదే తీరులో అటవీప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు పెనుబల్లి అటవీప్రాంతానికి వెళ్లారు. వీరు వేటకు వెళ్లిన ప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడుతున్న ఇతర వ్యక్తులు విద్యుత్‌ వైర్లను అమర్చారు. ఈ విషయాన్ని గమనించకుండా ముందు వెళుతున్న వెంకయ్య విద్యుత్‌ వైర్‌ను తాకాడు.

వెంకయ్య కిందపడిపోతుండటంతో ఆయనను కాపాడేందుకు సునీల్‌కుమార్‌ పట్టుకునేందుకు ప్రయత్నించి విద్యుత్‌ వైర్‌పై పడిపోయాడు. దీంతో కరెంట్‌ షాక్‌తో సునీల్‌కుమార్‌ మృతి చెందాడు. తమతో వేటకు వచ్చిన వ్యక్తి కరెంట్‌షాక్‌తో మృతి చెందడంతో ఆందోళన చెందిన వెంకయ్య, మున్నాలాల్‌లు బయటకు వచ్చి టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు విషయం ఉన్నతాధికారులకు చెప్పి డాగ్‌ స్క్వాడ్‌ను తెప్పించి అడవిలో గాలింపు చేపట్టారు.
సినిమా ట్విస్టులను తలపించేలా..
పోలీసులు అటవీ ప్రాంతానికి చేరుకున్న సమయానికి సునీల్‌ కుమార్‌ మృతదేహం సంఘటన స్థలం వద్ద మాయం కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, ట్రైనీ ఐపీఎస్‌ క్రాంతిలాల్‌పాటిల్‌ వెంకయ్య, మున్నాలాల్‌ను విచారించారు. అనంతరం విద్యుత్‌ ఉచ్చు అమర్చిన వాళ్లే మృతదేహాన్ని మాయం చేశారనే అనుమానంతో కొందరు అనుమానితులను విచారణ ప్రారంబించారు. పెనుబల్లి మండలానికి చెందిన ముగ్గురు వేటగాళ్లపై అనుమానితులుగా బావించి వారిని విచారణ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు చంటి అనే వ్యక్తిని విచారణకు పిలిపించడంతో భయంతో చంటి పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగడంతో గమనించిన పోలీసులు అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చంటి మృతి చెందాడు. ఈ కేసు విషయంపై నాలుగు రోజులుగా పోలీసులు విచారణ మమ్మురం చేశారు. వన్యప్రాణుల వేటలో పాల్గొంటున్న వారి వివరాలు సేకరిస్తూ విచారణ ప్రారంభించారు. 
కేసుల భయంతో మృతదేహాన్ని మాయం చేసిన వేటగాళ్లు..
పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో తాము ఎలాగైనా దొరికిపోతామన్న భయంతో వన్యప్రాణుల కోసం అడవిలో విద్యుత్‌ ఉచ్చులు బిగించిన మట్ట కృష్ణ, ముత్యాల రావు అనే వ్యక్తులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం వద్దకు తీసుకెళ్లి రాళ్లలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితుల సమాచారంతో పోలీసులు అడవిలోకి వెళ్లి సునీల్‌ మృతదేహాన్ని వెలికితీశారు. వన్యప్రాణుల వేటలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం, కేసుల భయంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని మాయం చేయడం భద్రాద్రి కొత్తగూడెంలో చర్చానీయాంశంగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget