Viral News: క్లాస్‌రూమ్‌లో బాలికపై అత్యాచారయత్నం చేసి టీచర్, కేకలు వేయడంతో పరారీ
Karnataka: కర్ణాటకలో స్కూల్ టీచర్ ఐదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌లోనే అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడం వల్ల అక్కడి నుంచి పరారయ్యాడు.
Viral News in Telugu: కర్ణాటకలోని ఓ స్కూల్‌లో దారుణ ఘటన జరిగింది. తరగతి గదిలోనే ఓ టీచర్ 11 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. కలబురగి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి దిగాడు. మిడ్ డే మీల్స్‌కి వెళ్లి క్లాస్‌కి వచ్చిన సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో క్లాస్‌లో బాలిక మాత్రమే ఉంది. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. కానీ ఆ బాలిక ధైర్యంగా పోరాడింది. సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. ఈ అరుపులు విన్న వెంటనే నిందితుడు స్కూల్ నుంచి పరారయ్యాడు. భయంతో ఇంటికి వెళ్లిన బాధితురాలు ఇంట్లో తల్లిదండ్రులకు విషయమంతా చెప్పింది. స్కూల్ ప్రిన్సిపల్‌తో మాట్లాడిన తల్లిదండ్రులు ఆ తరవాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సన్హితలో పోక్సో కేసులలో నిందితులకు శిక్షలు మరింత కఠినం చేసింది ప్రభుత్వం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానికంగా మైనర్లపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి.
ఇదే ప్రాంతంలో జూన్ నెలలో ఓ 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. బాధితురాలిని హాస్పిటల్‌కి తీసుకెళ్లగా 8 నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. కొన్ని నెలల పాటు ఆమపై అత్యాచారం జరిగినట్టు విచారణలో తేలింది.
Also Read: Viral News: అయోధ్యలో భారీ చోరీ, రూ.50 లక్షల విలువైన లైట్స్ ఎత్తుకుపోయిన దొంగలు