Telugu News: భార్యపై అనుమానం, చున్నీతో ఉరి బిగించి హత్య చేసిన పోలీస్
Karnataka: కర్ణాటకలో భార్యపై అనుమానం పెంచుకున్న పోలీస్ దారుణంగా హత్య చేశాడు.
Karnataka News Telugu:
కర్ణాటకలో దారుణం..
కర్ణాటకలో ఓ పోలీస్ భార్యపై (Karnataka Crime News) అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. 11 రోజుల క్రితమే ఈ జంటకు బాబు పుట్టాడు. భార్య పుట్టింట్లో ఉంది. దాదాపు 230 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ (Karnataka Cop Killed Wife) హత్య చేశాడు. ఆ తరవాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 32 ఏళ్ల కిశోర్ కర్ణాటకలోని చామరాజనగర్ నుంచి హోస్‌కోటేకి వెళ్లాడు. అంతకు ముందు భార్యకి 150 సార్లు కాల్ చేశాడు. భార్య ప్రతిభ ఒక్క కాల్ కూడా అటెండ్ చేయలేదు. అప్పటికే అనుమానంతో రగిలిపోతున్న కిశోర్..తన ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయకపోవడం వల్ల మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కోపంతోనే హత్య చేశాడు. చాలా రోజులుగా తన భార్య ఫోన్ కాల్స్‌ని రికార్డ్ చేస్తున్నాడు. మెసేజ్‌లనూ ట్రాక్ చేస్తున్నాడు. ఆమెతో మాట్లాడిన ప్రతి వ్యక్తినీ విచారించాడు. తన కొలీగ్స్‌లో కొంత మంది అబ్బాయిలతో చాలా సన్నిహితంగా ఉంటుందని అనుమానం పెంచుకున్నాడు.
కాల్ అటెండ్ చేయలేదని..
నవంబర్ 5వ తేదీన భార్యకి కాల్ చేసి తిట్టాడు. ఆ తరవాత ఆమె కాల్ కట్ చేసింది. అప్పటి నుంచి కాల్ అటెండ్ చేయడం మానేసింది. అనవసరంగా ఒత్తిడికి గురైతే బిడ్డకి ప్రమాదమని ఆమె తల్లి మందలించింది. మరుసటి రోజు ఉదయం కిశోర్ ప్రతిభకి 150 సార్లు కాల్ చేశాడు. ఇది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇది తెలుసుకుని కోపంతో వాళ్ల ఇంటికి వచ్చాడు కిశోర్. నేరుగా భార్య గదిలోకి వెళ్లాడు. డోర్ లాక్ చేశాడు. దుపట్టాతో ఆమె మెడకు ఉరి వేసి చంపాడు. గదిలోకి వెళ్లి ఎంత సేపటికీ బయటకు రాకపోవడం వల్ల అనుమానంతో ప్రతిభ తల్లి డోర్ కొట్టింది. పావుగంట తరవాత తలుపు తీసి "చంపేశాను" అంటూ గట్టిగా అరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. గతేడాది నవంబర్ 13న వీళ్లిద్దరికీ పెళ్లైనట్టు పోలీసులు వెల్లడించారు.
మహిళా ఉద్యోగి హత్య..
కర్ణాటకలో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోనే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 4వ తేదీన రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు ప్రతిమ. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యుటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సుబ్రహ్మణ్యపురలోని ఇంట్లో ఆమె రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు పోలీసులు. కత్తితో పొడిచి ఆమెని హత్య చేసినట్టు తెలిపారు. పని పూర్తైన తరవాత కార్ డ్రైవర్ ఆమెని ఇంట్లో దిగబెట్టారు. దాదాపు 8 ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నారు ప్రతిమ. ఆ తరవాత కాసేపటికే 8.30 గంటల ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో భర్త, కొడుకు వేరే చోటకు వెళ్లారు. ఆదివారం (అక్టోబర్ 5) ఉదయం ప్రతిమ సోదరుడు ఆమె ఇంటికి వెళ్లాడు. రక్తపు మడుగులో ఆమెని చూసి షాక్ అయ్యాడు. అంతకు ముందు రాత్రి చాలా సార్లు కాల్ చేసినా అటెండ్ చేయలేదు. అనుమానంతో ఉదయమే ఇంటికి వచ్చి చూశాడు. ఇంట్లో ఆమె మృతదేహాన్ని చూసిన వెంటనే పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు. ఈ కేసులో ఓ నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: 600 కిలోమీటర్లు శవంతోనే ప్రయాణం, రైల్వే ప్యాసింజర్స్‌కి ఊహించని అనుభవం