అన్వేషించండి

Bangalore Crime : బెంగళూరులో అమానవీయ ఘటన, కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన తండ్రి

Bengalore Crime : కర్ణాటక రాజధాని బెంగళూరులో అత్యంత దారుణ ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీల గురించి చెప్పిలేదన్న కోపంతో కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు తండ్రి.

Bengalore Crime : బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో రూ.1.5 కోట్ల లావాదేవీల వివరాలను తనకు చెప్పలేదన్న కోపంతో ఓ తండ్రి కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తండ్రి సురేంద్ర నడిరోడ్డుపై కుమారుడు అర్పిత్ పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మంటల్లో కాలుతూ అర్పిత్ రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పి అర్పిత్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మరణించాడు. దీంతో తండ్రి సురేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్థిక లావాదేవీలే కారణమా?

ఏప్రిల్ 1న ఆర్థిక లావాదేవీల కారణంగా 51 ఏళ్ల తండ్రి తన కుమారుడిపై పెట్రోల్ పోసి కాల్చిచంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అర్పిత్ గురువారం ఉదయం మరణించాడు. పశ్చిమ బెంగళూరులోని చామరాజ్‌పేటలోని వాల్మీకి నగర్‌లో ఏప్రిల్ 1వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తండ్రీ కొడుకులు సురేంద్ర కుమార్(బాబు), అర్పిత్‌లుగా పోలీసులుగుర్తించారు. సురేంద్ర కుమార్ అనే వ్యాపారవేత్త తన కుమారుడు అర్పిత్‌కి ఆర్థిక విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత అర్పిత్ బయటకు వెళ్లిపోయాడు. అయితే సురేంద్ర అతడిని వెంబడించి పెట్రోల్ పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించాడు. 

పక్కింటి వ్యక్తి ఫిర్యాదుతో వెలుగులోకి

అర్పిత్ తన తండ్రి నిప్పంటించాడని అరుస్తూ రోడ్డుపై పరుగులుపెట్టాడు. స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. అతను 60 శాతం కాలిన గాయాలతో విక్టోరియా ఆసుపత్రిలో చేరాడు.
బాబు కన్‌స్ట్రక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేస్తుంటాడని, అర్పిత్ తన తండ్రికి సాయం చేసేవాడని ప్రాథమిక విచారణలో తేలింది. గత కొన్ని నెలలుగా అర్పిత్ నిధుల గురించి సరైన లెక్కలు చెప్పలేదని ఆరోపిస్తూ కొన్ని ఆర్థిక విషయాలపై తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే అర్పిత్ బిల్డింగ్ నుంచి బయటకు రాగానే అర్పిత్‌పై బాబు పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలుస్తోంది. బాబు పక్కింటిలోని లారీ డ్రైవర్ అంబరీష్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 1న అర్పిత్ బిల్డింగ్ ముందు తన స్నేహితుడితో కబుర్లు చెబుతున్నప్పుడు బాబు నిప్పంటించడం చూశానని చెప్పారు. అర్పిత్ మృతి విషయం తెలియగానే ఫిర్యాదు చేసినట్లు అంబరీష్ పోలీసులకు తెలిపారు. అంబరీష్ ఫిర్యాదు మేరకు చామరాజ్‌పేట పోలీసులు బాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Konaseema Crime News: 38 టూవీలర్స్ కొట్టేసిన అయిదుగురు కేటుగాళ్లు అరెస్టు! పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
38 టూవీలర్స్ కొట్టేసిన అయిదుగురు కేటుగాళ్లు అరెస్టు! పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
Ketan Agarwal Murder: పెళ్లికి ముందే కాబోయే భర్తను లోయలోకి తోసి చంపిన పెళ్లికుమార్తె - ప్రియుడితో కలిసి ఘాతుకం - వీళ్లనేం చేయాలి?
పెళ్లికి ముందే కాబోయే భర్తను లోయలోకి తోసి చంపిన పెళ్లికుమార్తె - ప్రియుడితో కలిసి ఘాతుకం - వీళ్లనేం చేయాలి?
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB: అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
Union Cabinet Expansion: మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
OPS For AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
SIR Process Telangana: తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Ram Charan : మా బుడ్డది పెద్ది అంటోది - అసలు పేరు మర్చిపోతారేమో... రామ్ చరణ్ ఎమోషనల్
మా బుడ్డది పెద్ది అంటోది - అసలు పేరు మర్చిపోతారేమో... రామ్ చరణ్ ఎమోషనల్
Prakash Raj Non Bailable Warrant: ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్‌ వారెంట్ జారీ, అరెస్ట్ చేస్తారా?
ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్‌ వారెంట్ జారీ, అరెస్ట్ చేస్తారా?
Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ లాంచ్‌ - 457cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో కొత్త అప్‌డేట్స్
జంటగా షికార్లు చేయడానికి Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ - కొత్త లుక్‌తో యూత్‌కు ఫుల్ కిక్!
Embed widget