Karimnagar News : సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్యే చెప్పేవరకు విడిచిపెట్టమని తీవ్రంగా కొట్టిన పోలీసులు!
Karimnagar News : ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టాడని ఓ వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్టు పెట్టలేదని బాధితుడు వాపోతున్నాడు.
Karimnagar News : సోషల్ మీడియోలో ఓ వ్యక్తి పెట్టిన పోస్టు వివాదాస్పందం అయింది. ఈ విషయం అక్కడితో ఆగలేదు పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో వివాదం మరింత పెరిగింది. పోలీసులు లాఠీలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారంటూ బాధితుడి ఆరోపణలు చేస్తున్నారు. నడవలేని పరిస్థితిలో కాళ్లకు గాయాలయ్యాయని మీడియా ముందు వాపోయారు.
అసలేం జరిగింది?
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే, టీఆరెస్ నాయకులను ఉద్దేశించి టీఆర్ఎస్ కార్యకర్త తొంటి పవన్ ఆ పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ చేశారు. ఓ కుల సంఘాల భోజనాలకు వచ్చిన టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వాడిన పదజాలం అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్ట్ పెట్టడంటూ పవన్ పై పార్టీ మండల అధ్యక్షుడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అతనిపై చట్టపరమైన చర్యలకు తీసుకోకుండా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే చెబితే వదిలేస్తామంటూ చెప్పి పవన్ ను తీవ్రంగా కొట్టారు. పవన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని విపరీతంగా కొట్టారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యేని ఉద్దేశించి కాదు
అనుచిత వ్యాఖ్యలు నేరం