అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం - ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ప్రధాన సూత్రధారి!

Telangana News: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు తాజాగా ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

Key Twist In Phone Tapping Issue: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (PraneethRao), మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తాజాగా ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని.. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. 'ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పని చేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్తే మేం కూడా అలాగే చేశాం.' అని సదరు ఉన్నతాధికారితో అన్నట్లు సమాచారం. అంతే కాకుండా, ఎంతైనా మన పోలీసులం ఒకటని.. మా ఇళ్లల్లో సోదాలు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభాకర్ రావు ఫోన్ కు స్పందించిన ఉన్నతాధికారి.. 'మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్ కు  సమాధానం రాసి పంపించండి.' అని స్పష్టం చేశారట. దీంతో ప్రభాకర్ రావు ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.

కస్టడీ పిటిషన్

మరోవైపు, ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో పాటు నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ కోసం మంగళవారం పిటిషన్ వేయనున్నారు. ఈ ముగ్గుర్నీ కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. అటు, చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు సమాచారం. విచారణలో వెల్లడైన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఈ వ్యవహారం సాగిందని ప్రణీత్ రావు విచారణలో చెప్పారని.. ఈ మేరకు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ లను విచారించేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, తొలుత ఎస్ఐబీ ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావును విచారిస్తుండగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్ లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. 

Also Read: Telangana సీఎం రేవంత్ తెరవాల్సింది కాంగ్రెస్ గేట్లు కాదు, ప్రాజెక్టు గేట్లు- లక్షల రైతులతో సెక్రటేరియట్ ముట్టడి: హరీష్ రావు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Visakha Building Collapse: జాకీలతో లేపుతుండగా కూలిన భవనం, ఒకరు మృతి - విశాఖపట్నంలో విషాదం
జాకీలతో లేపుతుండగా కూలిన భవనం, ఒకరు మృతి - విశాఖపట్నంలో విషాదం
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karimnagar Robbery: కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్
కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP’s CM face in West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
Hyderabad MMTS Stations: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
Thalapathy Vijay Car Collection: దళపతి విజయ్ ద‌గ్గ‌ర‌ కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!
దళపతి విజయ్ ద‌గ్గ‌ర‌ కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!
US Iran War Updates: ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
Bengal BJP: బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
Embed widget