రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, పాలిష్ చేసి, బ్రాండెడ్ పేర్లతో విక్రయిస్తున్న రైస్ రీసైక్లింగ్ దందాను అధికారులు బట్టబయలు చేశారు.
PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
రంగారెడ్డి జిల్లాలో అనుమతుల్లేని 3 రైస్ మిల్లులపై అధికారులు దాడి చేసి, ప్రముఖ బ్రాండ్లుగా మార్చి విక్రయిస్తున్న క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- రంగారెడ్డిలో పీడీఎస్ బియ్యం అక్రమ రీసైక్లింగ్ దందా బయటపడింది.
- రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, ప్రముఖ బ్రాండ్ల పేరుతో విక్రయం.
- దాదాపు 19 బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసి మార్కెట్ చేశారు.
- అధికారుల దాడుల్లో క్వింటాళ్ల బియ్యం స్వాధీనం, విచారణ కొనసాగుతోంది.
Illegal PDS Rice Recycling Racket Busted | ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ (PDS) రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, పాలిష్ చేసి, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్న రైస్ రీసైక్లింగ్ వ్యవహారాన్ని అధికారులు బట్టబయలు చేశారు.
జిల్లాలోని మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని రైస్ మిల్లులు, గోదాములపై విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది. సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రాంకుమార్ నేతృత్వంలోని నాలుగు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 3 రైస్ మిల్లులు, వాటి గోదాముల్లో సోదాలు నిర్వహించి, క్వింటాళ్ల కొద్దీ అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా కనీస అనుమతులు లేకుండానే ఈ రైస్ మిల్లులను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాంకుమార్ తెలిపారు.

ఈ అక్రమ దందాలో భాగంగా ఒకే రకం రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి, ఏకంగా 19 రకాల ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. జేఎస్‌ఆర్ (JSR), ఎస్‌ఎస్, ఎస్‌జేఎల్, కౌ బ్రాండ్, కర్నూల్, ఫైవ్ స్టార్, ముబారక్, విజిఆర్, ఆర్ఆర్ఐ, బెస్ట్ హెచ్‌ఎంటీ, టమాటో గోల్డ్, గజరాజ్, సూర్య తేజ, జోకర్స్, అన్నపూర్ణ వంటి ఆకర్షణీయమైన బ్రాండెడ్ లేబుల్స్ వేసి ఈ బియ్యాన్ని ప్రముఖ సూపర్ మార్కెట్లు, స్టోర్లకు తరలిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఉన్న రైస్ మిల్లర్లు, వ్యాపారుల పాత్రపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.
బ్రాండెడ్ లేబుళ్లతో రేషన్ బియ్యాన్ని ప్రముఖ స్టోర్లకు మళ్లిస్తున్న ఈ దందాపై అధికారులు నిల్వలు, ప్యాకింగ్ సామగ్రిని పరిశీలిస్తూ లోతుగా విచారణ జరుపుతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టడం, మరోవైపు సన్న బియ్యం ధరలు కొండెక్కుతుండగం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
రేషన్ బియాన్ని 19 బ్రాండ్ల పేర్లతో సన్న బియ్యంగా అక్రమ విక్రయాలు
ఎస్ఎస్,
జేఎస్ఆర్,
ఎస్‌జేఎల్,
కౌ బ్రాండ్,
కర్నూల్,
ఫైవ్ స్టార్,
ముబారక్,
విజిఆర్,
జేఎస్ఆర్,
ఆర్ఆర్ఐ,
బెస్ట్ హెచ్‌ఎంటీ,
టమాటో గోల్డ్,
గజరాజ్,
సూర్య తేజ
జోకర్స్,
అన్నపూర్ణ
Frequently Asked Questions
రంగారెడ్డి జిల్లాలో అధికారులు ఏ అక్రమ కార్యకలాపాన్ని బట్టబయలు చేశారు?
ఈ అక్రమ దందా ఎక్కడ వెలుగులోకి వచ్చింది, దాడులు ఎవరు నిర్వహించారు?
ఈ దందా రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని రైస్ మిల్లులు, గోదాములలో వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని ఏ విధంగా విక్రయిస్తున్నారు?
వారు ఒకే రకం రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి, 19 రకాల ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్లు, స్టోర్లకు విక్రయిస్తున్నారు. మిల్లులు కనీస అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు తేలింది.
అక్రమంగా విక్రయించిన రేషన్ బియ్యానికి ఏయే బ్రాండ్ల లేబుళ్లను వాడుతున్నారు?
జేఎస్ఆర్, ఎస్ఎస్, కౌ బ్రాండ్, కర్నూల్, ఫైవ్ స్టార్, అన్నపూర్ణ వంటి 19 రకాల ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లను ఈ బియ్యానికి వాడుతున్నారు. వీటిని ప్రముఖ సూపర్ మార్కెట్లలో అమ్ముతున్నారు.
ట్రెండింగ్ వార్తలు























