అన్వేషించండి

Hyderabad: బాలికను వేధించిన ఉపాధ్యాయుడు, మూడేళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు!

Hyderabad: బాలికపై వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడికి పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ. 20 జరిమానా కూడా విధించింది.

Hyderabad Crime News: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కీచక పర్వానికి తెరతీశాడు. బాలికను లైంగికంగా వేధించాడు. ఫోన్లు, మెసేజ్ లు చేస్తూ వికృతంగా ప్రవర్తించాడు. చివరికి జైలు పాలయ్యాడు. హైదరాబాద్‌ లో మైనర్ బాలికను వేధించిన పాఠశాల ఉపాధ్యాయుడికి పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 25 ఏళ్ల యాచారం రమేష్ అనే ఉపాధ్యాయుడు 17 ఏళ్ల బాలికను వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని బాలిక ఇంటికి కూడా వెళ్లి బెదిరించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు రమేష్ ను హెచ్చరించి వదిలేశారు. మరోసారి అలా చేస్తే పోలీసు కేసు పెడతామని బెదిరించారు. బాలిక నుండి వచ్చిన బెదిరింపుల తర్వాత యాచారం రమేష్ మరింత రెచ్చిపోయాడు. మెసేజ్ లు, కాల్స్ చేస్తూ వేధిస్తూనే వచ్చాడు. గతంలోని కాల్ రికార్డింగ్ లను ఆమె కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో వారు రమేష్ పై మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు..

ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ అనంతరం ఉపాధ్యాయుడైన యాచారం రమేష్ ను పోక్సో కోర్టు (Hyderabad POCSO Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రమేష్ కు రూ. 20 వేలు జరిమానా విధించింది. 

పోక్సో చట్టం అంటే ఏమిటి?

వివిధ లైంగిక నేరాల నుండి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను రక్షించడానికి 2012లో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం రూపొందించబడింది.

పోక్సో చట్టం ప్రకారం.. ఆడ, మగ అనే తేడా లేకుండా 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలపై వేధింపులకు పాల్పడితే ఈ చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు. 
పోక్సో చట్టం ప్రకారం నేరాలను 5 రకాలుగా వర్గీకరించారు.  

అవేంటంటే..?

  1. పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్
  2. అగ్రిగేటివ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్
  3. సెక్సువల్ అసాల్ట్
  4. అగ్రిగేటివ్ సెక్సువల్ అసాల్ట్
  5. సెక్సువల్ హరాస్మెంట్

వేధిస్తే జైలుకే..

16-18 ఏళ్ల మధ్య వయసున్న బాలికపై నేరం చేసినట్లయితే పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులకు కనీస జైలు శిక్ష 10 సంవత్సరాలు. సమగ్ర లైంగిక వేధింపుల విషయంలో, చట్టం ప్రకారం కనీస 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ చట్టం ప్రకారం, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తికి మూడేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించబడుతుంది. అయితే సమగ్ర లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి కనీస శిక్ష ఐదు సంవత్సరాలు. లైంగిక వేధింపుల విషయంలో, నిందితుడిని మూడు సంవత్సరాల వరకు పొడిగించే జైలుకు పంపుతారు. పిల్లలను అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే నిందితులకు కూడా చట్టంలోని సెక్షన్లు వర్తిస్తాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget