![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hyderabad Crime : పెంట్ హౌస్ ఇనుప మెట్లకు ఉరి వేసుకుని 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య, అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ
Hyderabad Crime : హైదరాబాద్ మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లో పన్నెండేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ ఇనుప మెట్లకు ఉరి వేసుకున్న స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది.
![Hyderabad Crime : పెంట్ హౌస్ ఇనుప మెట్లకు ఉరి వేసుకుని 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య, అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ Hyderabad miyapur gokul flats minor girl suicide parents suspicious on murder Hyderabad Crime : పెంట్ హౌస్ ఇనుప మెట్లకు ఉరి వేసుకుని 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య, అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/14/f29c03fbf772ae5bd296e75e7d6b6dc3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Crime : హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లోని ఒక అపార్ట్మెంట్ లో 12 ఏళ్ల బాలిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలికను అత్యాచారం చేసి హత్య చేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పన్నెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి
మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లోని ఓ అపార్ట్ మెంట్ పైన పన్నెండేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికగా సంచలనమైంది. బాలికపై అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లోని ఓ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు ఓ వ్యక్తి. అతడు భార్య, 12 ఏళ్ల కూతురితో అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో బాలిక ఇంటి వద్దే ఉంటుంది. ఏంజరిగిందో కానీ అపార్ట్ మెంట్ టెర్రస్ పై బాలిక ఉరేసుకున్న స్థితిలో మృతి చెందింది.
అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ మెట్లకు
కూతురు కనిపించడంలేదని బాలిక తల్లిదండ్రులు స్థానికంగా వెతికారు. చివరకు అపార్ట్ మెంట్ పైన పెంట్ హౌస్ ఇనుపమెట్లకు చిన్నారి ఉరివేసుకుని కనిపించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను తెలిసినవారే టెర్రస్ పైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి విషయం బయటపెడుతుందోనని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనాస్థలంలో రక్తపు మరకలు చిన్నారిపై అత్యాచారం జరిగిందనే అనుమానానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఆధారాలను సేకరించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాలికపై అత్యాచారం జరిగిందో లేదో తేలుతుందని పోలీసులు అంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంత చిన్న వయసులో బాలికకు ఆత్మహత్య చేసుకునే ఆలోచన రాదని స్థానికులు అంటున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని బలంగా అనుమానిస్తున్నారు. బాలికకు ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు ఏముంటాంటున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్లుగానే అత్యాచారం జరిపి హత్యచేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read : Pullareddy Grandson : గదిలో భార్య ఉండగా బయట గోడ కట్టేసిన భర్త - పుల్లారెడ్డి మనవడి నిర్వాకం !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)