Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త
Hyderabad news : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రియుడితో భార్య ఉండగా రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నాడో వ్యక్తి. వారిద్దరినీ ఇంట్లో పెట్టి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదుచేశారు.
Hyderabad news : వివాహేతర సంబంధాలు కాపురాలు కూల్చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్త, పిల్లలను విడిచిపెట్టిందో మహిళ. ఇలాంటి ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ సైనికుడి భార్యతో మరో వ్యక్తి పాల్పడ్డాడు. ప్రియుడ్నే భర్తగా పరిచయం చేసిన సదరు మహిళ ఇల్లు అద్దెకు తీసుకుంది. యాదగిరినగర్ లో అద్దె ఇంట్లో ప్రియుడితో ఉంటోంది మహిళ. భర్తతో ఇద్దరు పిల్లలు కలిగాక పర ప్రియుడి మోజులో ఆర్మీ జవాన్ భార్య పడింది. అకస్మాత్తుగా ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్ మధుసూధన్ ఇంట్లో తన భార్య పరాయి పురుషుడితో ఉండడం చూశాడు. భార్యతో పాటు ఆమె ప్రియుడు జ్ఞానేశ్వర్ ను ఇంట్లోనే ఉంచి బయటి నుంచి గడియకు తాళం వేశారు మధుసూధన్. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ప్రియురాలితో భర్త
ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న భర్తను రెడ్ హ్యాండడ్ గా పట్టుకోంది ఓ మహిళ. భర్త చేసిన పనికి ఆగ్రహంతో అతడి, ప్రియురాలిని చితకబాదింది. కోనసీమ జిల్లాలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లై, పిల్లలున్న ఓ వ్యక్తి మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి ఆమె చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఆదివారం(మే 8న) వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కె.గంగవరం మండలం పేకేరు శివారు నల్లచెరువుపుంతలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన రాయుడు శ్రీనివాస్, కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన చీకట్ల వీరలక్ష్మిని పదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తరచూ ఇతర ప్రాంతాలకు పనిమీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన వివాహిత బెల్లం లక్ష్మీతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ఇరువురి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇంటికి తాళం వేసిన అత్త
ఇటీవల శ్రీనివాస్ భార్య వీరలక్ష్మి నడకుదురులోని పుట్టింటికి వెళ్లింది. దీంతో శనివారం రాత్రి ప్రియురాలు లక్ష్మిని శ్రీనివాస్ నల్లచెరువుపుంతలో తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన కొడుకు తండ్రి బాగోతాన్ని నాయనమ్మకు చెప్పాడు. శ్రీనివాస్ తల్లి సుబ్బాయమ్మ కొడుకు ప్రియురాలితో ఉన్న సమయంలో ఆ ఇంటికి తాళం వేసింది. అనంతరం కోడలికి సమాచారం ఇచ్చింది. ఆదివారం ఉదయం పోలీసులతో నల్లచెరువుపుంతకు వచ్చిన వీరలక్ష్మి, గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో తాళం తెరిచి ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివాహేతర సంబంధంపై భర్తను నిలదీసిన ఆమె కోపంతో భర్త, ప్రియురాలిని చితకబాదింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రాయుడు శ్రీనివాస్, అతని ప్రియురాలు బెల్లం లక్ష్మీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.