Hyderabad KBR Park : మొన్న నటి చౌరాసియా, నేడు మరో మహిళ-కేబీఆర్ పార్క్ లో ఆగని లైంగికదాడులు!
Hyderabad KBR Park : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మొన్న హీరోయిన్ చౌరాసియా పై ఓ అంగతుడు లైంగిక దాడి చేయగా, తాజాగా మరో మహిళపై లైంగిక దాడి జరిగింది.
Hyderabad KBR Park : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో మూలన ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలో మహిళపై లైంగిక దాడి కలకలం రేపుతోంది. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు(Jubilee Hills KBR Park)లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేబీఆర్ పార్క్ లో గుర్తు తెలియని దుండగులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. కేబీఆర్ పార్క్ వాకింగ్(Walking) కు వచ్చిన ఓ మహిళపై శనివారం ఓ దుండగుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళపై లైంగిక దాడి
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో మహిళా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఓ నటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. తాజాగా శనివారం ఉదయం భర్తతో మార్నింగ్ వాకింగ్(Morning Walking) వచ్చిన ఓ మహిళపై దుండగుడు దాడి చేశాడు. వాక్ వేలో నడుస్తున్న సమయంలో ఓ దుండగుడు మహిళ వెంటపడ్డాడు. కొంత దూరం వెళ్లాక మహిళను పట్టుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ పెద్దగా కేకలు వేయడంతో భర్త అక్కడకు చేరుకున్నాడు. భర్త రాకను గమనించిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై భర్తతో కలిసి మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
నటి చౌరాసియాపై దాడి
కేబీఆర్ పార్కులో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. నటి షాలు చౌరాసియా(Heroine Shalu Chourasiya)పై ఓ ఆగంతకుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. చౌరాసియా ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకుంది. రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్ కు వెళ్లిన సమయంలో తనపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించాడని నటి తర్వాతి రోజు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. నటి శాలు చౌరాసియాపై దాడి కేసు విచారణలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఈ కేసులో నిందితుడు నటి చౌరాసియాతో అసభ్యంగా వ్యవహరించినట్టు గుర్తించారు. ఆమె పెదాలు, మెడపై గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. చౌరాసియాను దుండగుడు చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లే యత్నం చేశాడనీ ఈ క్రమంలోనే ఆమె కాలి మడమకు గాయమైనట్లు గుర్తించారు. దీంతో నిందితుడు ఒక సైకోగా అంచనా వేశారు పోలీసులు.