By: ABP Desam | Updated at : 07 Dec 2021 07:24 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. జే9-1403 ఫ్లైట్ లో కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 233.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ట్రౌజర్ లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.11.49 లక్షలు ఉంటుందని తెలిపారు. బంగారాన్ని సీజ్ చేసి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు.
On 07.12.2021 Hyderabad Customs booked a case of gold smuggling against a passenger who arrived by Flight J9-1403 from Kuwait. 233.20 grams of gold valued at Rs.11.49 lakhs, concealed inside the secret pocket of trouser, has been seized. @PIBHyderabad @cgstcushyd @cbic_india pic.twitter.com/sNrImrVEFa
— Hyderabad Customs (@hydcus) December 7, 2021
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
నకిలీ వీసాలతో కువైట్ కు 44 మంది మహిళలు
నకిలీ వీసాలతో గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన 44 మంది మహిళలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంత మంది దళారులు డబ్బులు తీసుకుని నకిలీ వీసాలు ఇచ్చారు. మహిళలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి టికెట్లు బుక్ చేశారు. దీంతో గల్ఫ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన మహిళలు వీసాలు, ధ్రువీకరణ పత్రాలు చూపించగా అవి నకిలీవని ఇమిగ్రేషన్ అధికారులు తేల్చారు.
Also Read: వీఆర్ఏ గౌతమ్ మృతి.. ఇసుక మాఫియాపై ఫ్యామిలీ అనుమానం
ముంబయిలో ఒకరు, ఏపీలో ఇద్దరు ఏజెంట్లు
మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు అప్పగించారు. మహిళలను ప్రశ్నించిన పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. మహిళలందరూ ఒకే దేశానికి రెండు వీసాలతో బయలుదేరారు. విసిటింగ్ వీసా ఇండియన్ ఇమిగ్రేషన్ వద్ద ఎంప్లాయిమెంట్ వీసా కువైట్‌లో చూపించాలని దళారులు మహిళలతో నమ్మబలికారు. వీసా, ధ్రువపత్రాలను పరిశీలించేటప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు వీటిని గుర్తించారు. ముంబయిలో ఉన్న ఓ ఏజెంట్, ఏపీలో ఇద్దరు సబ్ ఏజెంట్లు కలిసి మహిళలను దేశం దాటించేందుకు ప్రయత్నించారని పోలీసుల విచారణలో తెలింది. దళారులపై 420, 471 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు... కీచక టీచర్ కు దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, పాతకక్షలతో మర్డర్!
Satysai District Crime News: సత్యసాయి జిల్లాలో దారుణం - ఆరో తరగతి విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం
Hyderabad: ఒకరోజులో 20 ఇళ్లలో దొంగతనాలు! అవాక్కైన పోలీసులు - ఎట్టకేలకు అరెస్టు
Rompicharla: టీడీపీ లీడర్పై తుపాకీ కాల్పుల కలకలం- ఆ వైసీపీ ఎమ్మెల్యే పనేనంటున్న తెలుగుదేశం
Hyderabad Fire Accident: చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, సమీప బస్తీల్లో జనం భయాందోళన
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!