Hyderabad Crime News: ఇంటర్వ్యూకు వచ్చిన యువతిపై అత్యాచారయత్నం, సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ అరెస్టు!
Crime News in Telugu: సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ నవీన్ కుమార్ యువతిని ఇంటర్వ్యూ తీసుకుని.. సెలెక్ట్ అయినట్లు చెప్పాడు. అనంతరం దుర్భుద్ధి ప్రదర్శించినట్లుగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
![Hyderabad Crime News: ఇంటర్వ్యూకు వచ్చిన యువతిపై అత్యాచారయత్నం, సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ అరెస్టు! Hyderabad crime news young woman who came for interview was molested Telugu Latest News Hyderabad Crime News: ఇంటర్వ్యూకు వచ్చిన యువతిపై అత్యాచారయత్నం, సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ అరెస్టు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/10/18b4abe133691cba0f377f516a91973b1715339626162234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Woman News: హైదరాబాద్ లో ఓ యువతి ఉద్యోగం కోసం వెళ్లి అత్యాచార యత్నానికి గురైంది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా యువతి ఇంటర్వ్యూ కోసం వెళ్లగా.. ఆ మేనేజర్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మధురా నగర్‌లో టెక్ ఫ్లో అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం కోసం ఓ యువతి అప్లై చేసుకుంది. ఆ తర్వాత ఆ యువతికి కాల్ చేసి కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూకి పిలిచింది. దీంతో ఆ యువతి మధురా నగర్ లోని ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం హాజరైంది.
అనంతరం మేనేజర్ నవీన్ కుమార్ ఆమెను ఇంటర్వ్యూ తీసుకున్నాడు. మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారని.. కంపెనీ తరపున ఆఫీస్ సిమ్ కార్డ్ ఇస్తామని చెప్పాడు. తన వద్ద ప్రస్తుతం సిమ్ కార్డు లేదని.. రేపు ఇంటికి రావాలని మేనేజర్ చెప్పాడు. ఇలా మేనేజర్ ఇంటికి యువతి వెళ్లింది.
ఆమె లోపలికి వెళ్లగానే తలుపు వేసి.. యువతిపై మేనేజర్ అత్యాచారానికి ప్రయత్నించినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. యువతి కేకలు వేయడంతో చంపుతానని బెదిరించాడని.. అక్కడి నుంచి తాను తప్పించుకున్నానని యువతి తెలిపింది. అలా మధురా నగర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. మేనేజర్ నవీన్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)