News
News
వీడియోలు ఆటలు
X

Hyderabad Crime News: లైంగికదాడికి యత్నించిన సవతి తండ్రిపై కూతురు దాడి, చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

Hyderabad Crime News: వరసకు కూతురయ్యే యువతిపై కన్నేశాడు. ఆమె తల్లి బయటకు వెళ్లగానే లైంగిక దాడికి యత్నించాడు. తనను తాను కాపాడుకునేందుకు బాలిక కర్ర తీసి కొట్టగా కుప్పకూలిపోయాడు. చివరకు ఏమైందంటే?

FOLLOW US: 
Share:

Hyderabad Crime News: హైదరాబాద్ లో దారుణం జరిగింది. కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడో కసాయి తండ్రి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె.. తండ్రిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రోజు రాత్రి మృతి చెందాడు. 

అసలేం జరిగిందంటే..?

కండ్లకోయలో నివాసం ఉంటున్న ఒరిస్సాకు చెందిన జయశ్రీ నాయక్ అనే మహిళ పద్మనాభ నాయక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. గత మూడు నెలల క్రితం జయశ్రీ నాయక్ మొదటి భర్త కూతురు (17) తల్లి ఉంటున్న ప్రాంతానికి వచ్చింది. ఈ క్రమంలో సవతి తండ్రి చేష్టలు నచ్చేవి కాదు. పలుమార్లు హెచ్చరించింది. అయినా అతడు తీరు మార్చుకోలేదు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం సమయంలో జయశ్రీ నాయక్ డ్యూటీకి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న వరసకు కూతురైన ఆమె వద్దకు పద్మనాభ నాయక్ పుల్ గా తాగి వచ్చాడు. బాగా మద్యం సేవించి ఉన్న అతడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి తనును తాను కాపాడుకునేందుకు పక్కనే ఉన్న కర్రతో అతడిని కొట్టింది. తలపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. అయితే జయశ్రీ నాయక్ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చేసరికి అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఏమైందని ప్రశ్నించగా.. కూతురు అసలు విషయం చెప్పింది. వెంటనే స్థానికుల సాయంతో పద్మనాభ నాయక్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే మైలార్ దేవ్ పల్లిలో ఇలాంటి ఘటనే..

తెలంగాణలో దారుణ ఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ సవతి తండ్రి నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక చేశాడు. అన్యం పుణ్యం తెలియని చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు.  మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన జరిగింది. రైల్వే బుద్వేల్ లోని ఓ కాలనీకి చెందిన వెంకటయ్య తన కుటుంబంతో నివసిస్తున్నాడు.  అతనితో కలిసి మహిళ ఉంటుంది. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి అతడిని ఆప్యాయంగా నాన్న అనే పిలుస్తుందని స్థానికులు అంటున్నారు. అతడు శంషాబాద్ ఫ్లైఓవర్ వద్ద లేబర్ క్యాంప్ లో ఆ చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. తండ్రి అని మర్చిపోయి నాలుగేళ్ల చిన్నారి కానీ కూడా ఆలోచించకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నొప్పి తట్టు కోలేక చిన్నారి ఏడుస్తూ తల్లివద్దకు వెళ్లి నాన్న చేసిన పనిని చెప్పింది. దీంతో తల్లి చిన్నారిని తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వెంకటయ్యను అరెస్ట్ చేశారు.  వావి వరసలు మరిచి పసిమొగ్గలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం ఈ మధ్య చాలా ఎక్కువైంది. 

Published at : 10 May 2023 09:59 AM (IST) Tags: Hyderabad Crime News Latest Murder Case Telangana News Molested

సంబంధిత కథనాలు

Delhi murder:  ఢిల్లీలో నడి రోడ్డుపై బాలిక హత్య - ఒక్కరూ ఆపలేదు!

Delhi murder: ఢిల్లీలో నడి రోడ్డుపై బాలిక హత్య - ఒక్కరూ ఆపలేదు!

Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య

Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?