అన్వేషించండి
Advertisement
Bus Accident: గద్వాల్‌లో వోల్వా బోల్తా- పడిన వెంటనే దగ్ధం- మహిళ సజీవ దహనం
Bus Accident At Gadwal: గద్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ప్రయాణికులతో వెళ్తూ బోల్తా పడింది. బీచుపల్లి పదో బెటాలియన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Bus Accident At Gadwal: గద్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ప్రయాణికులతో వెళ్తూ బోల్తా పడింది. బీచుపల్లి పదో బెటాలియన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేకువజాము మూడు గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది. ప్రయాణికులు అప్రమత్తం అవ్వడంతో పెను ముప్పు తప్పిందని చెబుతున్నారు.
ప్రమాదంలో బస్సు బోల్తా పడిన వెంటనే మంటల్లో చెలరేగాయి. ప్రయాణికులు స్పందించి త్వరగా బయటపడ్డారు. అయితే ఒక మహిళ మాత్రం ఈ దుర్ఘటనలో మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తోంది. బస్సు ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమన్య స్థానాలకు చేర్చారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion