అన్వేషించండి

FIFA Rights Scam: ఫిఫా రైట్స్ వెనుక పెద్దల స్కెచ్? హైదరాబాద్ స్టార్టప్‌ను ముంచేసిన అమెరికా మాయగాడు.. రంగంలోకి సీసీఎస్!

Corporate Crime: రూ. 670 కోట్ల ఫిఫా మీడియా హక్కుల వేలంలో హైదరాబాద్ స్టార్టప్‌ను ముంచేశారు ఓ అమెరికా ఇన్వెస్టర్. అయితే దీనిక పెద్ద స్కామ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad CCS Police FIFA Case:   అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమరం ప్రపంచకప్  మీడియా హక్కుల వేలంలో భాగ్యనగరానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ చుట్టూ టాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే రేంజ్‌లో సరికొత్త  కార్పొరేట్ క్రైమ్ త్రిల్లర్  స్క్రిప్ట్ బయటపడింది. గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టి చక్రం తిప్పాలని చూసిన ఒక హైదరాబాద్ సంస్థను, అమెరికా నుంచి వచ్చిన ఒక నకిలీ ఇన్వెస్టర్ ఫోర్జరీ పత్రాలతో నట్టేట ముంచిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. రూ. 670 కోట్ల   భారీ డీల్ కుదుర్చుకున్న సదరు స్టార్టప్‌ను ఆఖరి నిమిషంలో కుట్రపూరితంగా దెబ్బకొట్టారు.  ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్  పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ  ఫుట్‌బాల్ స్కామ్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.  

 హైదరాబాద్‌కు చెందిన  మెటల్లాయిడ్ ప్రొడక్షన్స్ అధినేత ప్రీతీష్ కొల్లాటి, దేశీయ మీడియా దిగ్గజాలకు షాకిస్తూ ఫిఫా ఇండియన్ సబ్‌కాంటినెంట్ ప్రసార హక్కులను దక్కించుకున్నారు. మొదట ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రసార భారతి  తో కలిసి అంతా సజావుగానే సాగుతుందనుకున్న తరుణంలో సీన్ అడ్డం తిరిగింది. కొన్ని  అదృశ్య శక్తుల నుంచి వచ్చిన రాజకీయ, కార్పొరేట్ ఒత్తిళ్ల కారణంగా ప్రసార భారతి ఆఖరి నిమిషంలో ఈ మెగా ఈవెంట్ నుంచి హఠాత్తుగా యూ-టర్న్ తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఇలా తప్పుకోవడంతో ఫండింగ్ కోసం హైదరాబాద్ యువ పారిశ్రామికవేత్త తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాల్సి వచ్చింది.

సరిగ్గా ఇదే సమయంలో ఈ స్టార్టప్‌ను టార్గెట్ చేస్తూ అవని ఎల్‌ఎల్‌సీ అధినేత దిలీప్ మస్కే అలియాస్ శామ్ అమెరికా నుంచి ఎంట్రీ ఇచ్చాడు. ఈ డీల్ కోసం తాను రూ. 400 కోట్ల పెట్టుబడి పెడతానంటూ నమ్మబలికి, అంతర్జాతీయంగా పేరున్న స్విట్జర్లాండ్  UBS బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లెటర్లను తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. అయితే, ఫిఫా స్క్రీనింగ్‌లో ఆ డాక్యుమెంట్లన్నీ పక్కా ఫోర్జరీ అని తేలిపోవడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. నకిలీ పత్రాలు సమర్పించారనే ఆగ్రహంతో ఫిఫా సంస్థ హైదరాబాద్ కంపెనీ డీల్‌ను రద్దు చేయడమే కాకుండా, ఆ సంస్థను ఏకంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో ప్రీతీష్ కొల్లాటి నెత్తిన పిడుగు పడినట్లయింది.  

అయితే, ఫిఫా లాంటి అంతర్జాతీయ సంస్థలు సులభంగా పసిగట్టే నకిలీ పత్రాలను ఆ అమెరికా ఇన్వెస్టర్ కావాలనే ఎందుకు సబ్మిట్ చేశాడు? అనే కోణంలో విశ్లేషిస్తే దీని వెనుక బడా కార్పొరేట్ లాబీ ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే, మెటల్లాయిడ్ ప్రొడక్షన్స్ డీల్ రద్దయిన వెంటనే.. మార్కెట్లో ఎగబడి కొంటారనుకున్న బడా సంస్థలన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. చివరకు రేటు భారీగా పడిపోయాక, జీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి దిగి, మొదట అనుకున్న రూ. 670 కోట్ల ధర కంటే దాదాపు సగం రేటుకే, అంటే రూ. 330 కోట్ల నుంచి రూ. 500 కోట్ల లోపు ధరకే ఆ మెగా రైట్స్‌ను కారుచౌకగా ఎగరేసుకుపోయింది. ఒక స్టార్టప్ కంపెనీ అంత పెద్ద డీల్ సొంతం చేసుకుంటే తమ మార్కెట్ ఎక్కడ పడిపోతుందోనని భావించిన బడా మీడియా శక్తులు, ఒక  మధ్యవర్తి ను వాడుకుని ఈ స్కెచ్ వేశాయా అనే చర్చ నడుస్తోంది.

ఈ మోసం కారణంగా రూ. 2 కోట్ల వరకు సొంత నగదు నష్టపోవడమే కాకుండా, అంతర్జాతీయంగా తన కంపెనీ ప్రతిష్ట దెబ్బతిందని ప్రీతీష్ కొల్లాటి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి, అమెరికా మాయగాడు దిలీప్ మస్కేపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Embed widget