అన్వేషించండి

Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్

తిరుపతి జిల్లా డీఎస్పీనంటూ ప్రచారం చేసుకుని, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడ్ని హైదరాబాద్ సీసీఎస్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఈఓడబ్ల్యూ బృందం అరెస్ట్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తిరుపతి డీఎస్పీగా నమ్మించి, మోసాలు చేసిన కేవీపీ రాజు అరెస్ట్.
  • నకిలీ కంపెనీలలో భారీ లాభాల పేరుతో పెట్టుబడులు ఆకర్షించారు.
  • ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులంటూ బెదిరించి, కోటి 20 లక్షలు మోసం చేశారు.
  • నకిలీ వాగ్దానాలు నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు.

తిరుపతి జిల్లా డీఎస్పీగా అవతారమెత్తి, కంపెనీల్లో పెట్టు బడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ డిటెక్టివ్ డిపార్ట్‌ మెంట్ ఈఓడబ్ల్యూ బృందం అరెస్ట్ చేసింది. 2021 నుంచి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌ లోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కొండూరు రెడ్డి వెంకట్ రాజు (40) అలియాస్ కేవీపీ రాజు, డీఎస్పీ రాజుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీపీ రాజు, అతని ముఠా సభ్యులు తాము సీనియర్ పోలీస్ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలువుర్ని  లక్ష్యంగా చేసుకునేవారు. ఉనికిలో లేని నకిలీ కంపెనీలను అసలుసిసలైన కంపెనీలుగా పేర్కొంటూ.. పెట్టుబడులు పెడితే స్వల్పకాలం లోనే భారీ లాభాలు వస్తాయని నమ్మించే వారు. బాధితులకు నమ్మకం కలిగించేందుకు సెక్యూరిటీ పేరుతో నకిలీ ఆస్తి పత్రాలు, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేవారు. 

ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులం అంటూ బెదిరింపులు
అనంతరం గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకునేవారు. బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీస్తే తాము ఎన్‌ కౌంటర్ స్పెషలిస్టుల మంటూ బెదిరింపులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ బాధితుడి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసి మోసం చేయడంతో అతని ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో 406, 420, 170 సెక్షన్లతో పాటు 34 ఐపీసీ కింద కేసు నమోదైంది. నిందితుడు కేవీపీ రాజుపై గతంలోనే మరో 3 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 

తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో  419, 420 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద, హైదరాబాద్‌లోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌లో  420, 468, 471 r/w 120(B) ఐపీసీ సెక్షన్ల కింద, నెల్లూరు జిల్లా వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో  420, 406, 468, 170 r/w 120(B) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అధిక లాభాలు ఇప్పిస్తామంటూ వచ్చే నకిలీ వాగ్దానాలు, ప్రచారాలను నమ్మి ప్రజలు తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి మోసపోవద్దని హైదరాబాద్ సీసీఎస్ డిప్యూటీ కమిషనర్ ప్రజలకు సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థలు, వ్యక్తుల విశ్వసనీయత, డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు.

Frequently Asked Questions

ఎవరు అరెస్టు అయ్యారు మరియు వారిపై ఉన్న ఆరోపణలు ఏమిటి?

కొండూరు రెడ్డి వెంకట్ రాజు అలియాస్ కేవీపీ రాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను తిరుపతి డీఎస్పీగా నటిస్తూ, భారీ లాభాల ఆశచూపి నకిలీ కంపెనీలలో పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేశాడు.

మోసగాడు ప్రజలను ఎలా మోసం చేసేవాడు?

కేవీపీ రాజు తన ముఠాతో కలిసి సీనియర్ పోలీస్ అధికారులమని చెప్పుకునేవాడు. ఉనికిలో లేని కంపెనీలలో పెట్టుబడులు పెడితే స్వల్పకాలంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసాలు చేసేవాడు.

మోసగాడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

హైదరాబాద్ సీసీఎస్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఈఓడబ్ల్యూ బృందం కేవీపీ రాజును అరెస్టు చేసింది. అతనిపై ఐపీసీ 406, 420, 170 తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండటానికి పోలీసులు ప్రజలకు ఏమి సూచిస్తున్నారు?

ప్రజలు అధిక లాభాలు ఇప్పిస్తామనే నకిలీ వాగ్దానాలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థలు, వ్యక్తుల విశ్వసనీయత, డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Hair Care Tips : జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
Embed widget