అన్వేషించండి

E Challan Scam: ఏపీలో ఈ - చలానా స్కామ్ - రూ.36.52 కోట్లు దుర్వినియోగం

ఏపీలో భారీ స్కామ్ వెలుగుచూసింది. పోలీస్ శాఖలో ఈ - చలానా కుంభకోణంలో రూ.36.52 కోట్లు దుర్వినియోగమైనట్లు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు తెలిపారు.

ఏపీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పోలీస్ శాఖలో జరిగిన ఈ - చలానా కుంభకోణంలో మొత్తం రూ.36.52 కోట్లు దుర్వినియోగమైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ స్కామ్ పై గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు వివరాలు వెల్లడించారు. కొమ్మిరెడ్డి అవినాష్ కు చెందిన రేజర్ పీఈ ఖాతాకు డబ్బంతా మళ్లించారని, దీంతో పీఈ ఖాతా నుంచి నగదు డీజీ ఖాతాకు జమ కాలేదన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబరులో తిరుపతి యూనిట్ లో గుర్తించామని తెలిపారు.

విచారణతో వెలుగులోకి

ఈ కుంభకోణంపై డేటా సొల్యూషన్స్ నిర్వాహకుడు అవినాష్ ను సంజాయిషీ అడిగామని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు తెలిపారు. నిధుల దుర్వినియోగంపై వివరణ అడిగినట్లు చెప్పారు. డేటా సొల్యూషన్ ప్రతినిధి రాజశేఖర్ ను ప్రశ్నించినట్లు చెప్పారు. సరైన సమాచారం ఇవ్వకుండా అవినాష్ కాలయాపన చేశారని, అందుకే రాజశేఖర్ ను అరెస్ట్ చేసి విచారించగా, నిధుల దుర్వినియోగం చేసినట్లు అంగీకరించాడని వెల్లడించారు. ఈ క్రమంలో అవినాష్ ఆస్తుల విషయమై సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాశామని, ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపేసేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. త్వరలోనే అవినాష్ ను పట్టుకుంటామని పాలరాజు స్పష్టం చేశారు.

తెలంగాణలో కొత్త తరహా మోసం

ఇదిలా ఉండగా, తెలంగాణలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. తాజాగా, ట్రాఫిక్ పోలీసులమంటూ ఫేక్ చలానాలు మెసేజ్ ల రూపంలో పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటూ ఆకర్షిస్తుండగా, నిజమేనని నమ్మిన చాలా మంది రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సందేశాలు, ఫేక్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.

మోసం ఇలా

నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాహన యజమాని నెంబర్లకు చలానా వివరాలు సందేశాలుగా వస్తాయి. దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. e-Challan పేరుతో ఫేక్ మెసేజెస్ పెట్టి సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. డబ్బు కట్టేందుకు లింక్ క్లిక్ చేయాలని చెబుతారు. సదరు లింక్ పై ఎవరైనా క్లిక్ చేస్తే మొబైల్ వ్యక్తిగత సమాచారం సహా మొత్తం డేటా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. 

అలాంటి లింక్స్ పై క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్ కావడం సహా కొన్ని యాప్స్ కూడా తెలియకుండా డౌన్ లోడ్ అయిపోతాయి. తద్వారా సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకుని డబ్బంతా దోచేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు మొబైల్ లోని ఫోటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించి బెదిరించి మరీ డబ్బు కొట్టేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు చేయండిలా

నకిలీ ఈ - చలానాల పేరుతో వచ్చిన మెసేజ్ లను నమ్మి డబ్బు పోగొట్టుకున్న వారు 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద నకిలీ మెసేజ్ లు వస్తే, వాటిని ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 8712672222 కు పంపి కంప్లైంట్ చేయాలని స్పష్టం చేశారు. పట్టణాల్లో ఎవరైనా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలానా మెసేజ్ వస్తుంది. అలా కాకుండా ఎవరికైనా ఫేక్ మెసేజ్ వచ్చినట్లు అనిపిస్తే పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని 'ఈ-చలానా' వెబ్ సైట్ లో తనిఖీ చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అక్కడ ఉంటే అందులోనే నగదు చెల్లించొచ్చని పేర్కొంటున్నారు. ఫేక్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తింపు లేని యాప్స్ డౌన్ లోడ్ చేసుకోకూడదని సూచిస్తున్నారు.

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Embed widget