అన్వేషించండి

Hit-And-Run Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ కేసు, 3 కి.మీ. వరకూ కార్‌ రూఫ్‌పైనే బాధితుడు - తీవ్ర గాయాలతో మృతి

Hit-And-Run Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది.

Delhi Hit-And-Run Case:

కార్‌ రూఫ్‌పైనే..

ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ (Hit And Run) కేసు వెలుగులోకి వచ్చింది. వీఐపీ జోన్‌లోనే ఈ ఘటన జరగడం సంచలనమవుతోంది. కస్తుర్బా మార్గ్‌లో  
ఓ కార్‌ టూవీలర్‌ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైక్‌పై ఇద్దరు ఉన్నారు. ఓ వ్యక్తి ఎగిరి కొంత దూరంలో పడిపోగా మరో వ్యక్తి మాత్రం కార్‌ రూఫ్‌పై పడిపోయాడు. ఇది తెలిసి కూడా ఆ కార్ డ్రైవర్ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇది చూసి గట్టిగా అరిచాడు. కార్ ఆపమని ఎంత చెప్పినా వినకుండా స్పీడ్ పెంచి మరీ వెళ్లిపోయాడు ఆ కార్ డ్రైవర్. దాదాపు మూడు కిలోమీటర్ల వరకూ ఎక్కడా ఆపలేదు. ఢిల్లీ గేట్ వద్ద కార్ రూఫ్‌పై ఉన్న వ్యక్తిని కింద పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో 30 ఏళ్ల దీపాన్షు వర్మ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కజిన్ ముకుల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు...వెంటనే నిందితుల కోసం గాలించారు. అనుమానితులను అరెస్ట్‌ చేశారు. మృతుడు దీపాన్షు వర్మ ఓ జ్యువెలరీ షాప్‌ని నడుపుతున్నాడు. మహమ్మద్ బిలాల్ అనే వ్యక్తి ఈ ఇన్సిడెంట్‌ని వీడియో తీసి పోలీసులకు అందించాడు. ఆ వీడియో ఆధారంగా పలువురుని అదుపులోకి తీసుకున్నారు. అయితే...ఈ కేసుకి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. 

గతంలోనూ..

ఢిల్లీలో హిట్ అండ్ రన్ కేసులు కొత్తేం కాదు. కంజావాలాలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరవాత నోయిడాలో ఓ కార్‌ టూవీలర్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న స్విగ్గీ ఏజెంట్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొట్టిన తరవాత దాదాపు 500 మీటర్ల వరకూ కార్‌..బైక్‌ని లాక్కెళ్లిందని పోలీసులు వెల్లడించారు. "స్విగ్గీ ఏజెంట్ కౌశల్...ఫుడ్ డెలివరీ కోసం బయటకు వచ్చాడు. నోయిడా సెక్టార్ 14 వద్ద ఓ కార్ వేగంగా వచ్చి ఢీకొట్టింది" అని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం...బైక్..కార్‌కు చిక్కుకుంది. కొంత దూరం వరకూ కార్ డ్రైవర్ అలానే ముందుకు వెళ్లాడు. కార్‌లో బాధితుడు చిక్కుకున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అప్పుడు కానీ డ్రైవర్ కార్‌ ఆపలేదు. అప్పటికే కౌశల్ మృతి చెందాడు. మృతుని వయసు 24 ఏళ్లు అని పోలీసులు నిర్ధరించారు. అర్ధరాత్రి 1 గంటకు కౌశల్‌కు తన సోదరుడు కాల్ చేశాడు. అప్పటికే కౌశల్ ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్‌ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి కాల్ అటెండ్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. "యాక్సిడెంట్ స్పాట్‌ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. నిందితుడిని పట్టుకుంటాం" అని పోలీసులు వెల్లడించారు. 

Also Read: karnataka elections 2023: కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా భజ‌రంగ్ ద‌ళ్ నిర‌స‌న‌, మేనిఫెస్టో కాపీలు ద‌గ్ధం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Alert for single Men: అమ్మాయిలు, ఆంటీలతో రసిక చాట్ అంటే కక్కుర్తి పడకండి - ఈ కొత్త మోసం గురించి తెలుసుకోండి !
అమ్మాయిలు, ఆంటీలతో రసిక చాట్ అంటే కక్కుర్తి పడకండి - ఈ కొత్త మోసం గురించి తెలుసుకోండి !
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు

వీడియోలు

IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Embed widget