అన్వేషించండి

Chittore: నోట్లో గుడ్డ కుక్కి బాలికపై మేనమామ అత్యాచారం, వెంటనే హత్య!

పదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడి హత మార్చిన దారుణమైన ఘటన చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం, సోమపురం గ్రామంలో చోటు చేసుకుంది.

మహిళ కనిపిస్తే చాలు మాగవ మృగాలు రెచ్చి పోతున్నారు. వయస్సుతో తేడా లేకుండా పసికందుల వద్ద నుండి పండు ముసళ్ళలని చూడకుండా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడి హత మార్చిన దారుణమైన ఘటన చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం, సోమపురం గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం‌ కింద కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు ఏమైందంటే. ???

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం..  చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం, సోమపురం‌ గ్రామానికి చెందిన బాలకృష్ణ, భాగ్యలక్ష్మీ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి  శాంతి(15) అనే ఒక్కగానొక్క కుమార్తె ఉంది. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా బాలకృష్ణ, భాగ్యలక్ష్మీ దంపతులు పెంచుకునే వారు. సోమపురానికి పక్కనే ఉన్న రాళ్ళబుదుగురు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో శాంతి పదో తరగతి చదువుతుంది. సోమపురానికి పక్క గ్రామమైన వేంకటేశ్వరపురానికి చెందిన కళ్యాణ్ పాల డైరీలో ఆటో డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  ఇతను శాంతికి సొంత మేనమామ.

పక్క గ్రామం కావడంతో శాంతి సొంత మేనమామ అయిన కళ్యాణ్ తరచూ ఇంటికి వచ్చి వెళ్ళే వాడు. అలానే శాంతిని పాఠశాలకు తీసుకెళ్ళి, తిరిగి తీసుకొచ్చేవాడు. బుధవారం (ఆగస్టు 2) సాయంత్రం రోజు మాదిరిగానే కళ్యాణ్ తన మేన కోడలైన శాంతిని స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా శాంతిపై కన్నెసిన కళ్యాణ్, బాలిక నోటిలో గుడ్డ నొక్కి అత్యాచారం చేసాడు. బాలిక విషయం బయట చెప్తుందని భయపడిన కళ్యాణ్, బాలిక గొంతు నులిమి హత్య చేశాడు. బాలిన మృతి చెందిన తర్వాత ఇంటి నుండి పరార్ అయ్యాడు.  

అయితే కూలీ పనులు పూర్తి చేసుకుని‌ ఇంటికి వచ్చిన శాంతి తల్లిదండ్రులు బాలకృష్ణ, భాగ్యలక్ష్మీలు ఇంటిలో విగతజీవిలా పడి ఉన్న శాంతిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు. అయితే కుమార్తె మృతిదేహాన్ని చూసి వారు కేకలు వేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న స్ధానికులు కళ్యాణ్ ఇంటికి వచ్చి వెళ్ళడం తాము చూసామని, కళ్యాణే ఈ దారుణంకు ఒడిగట్టి ఉంటాడని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.‌ దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పదో తరగతి బాలికను దారుణంగా హత్య చేసిన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.‌

టాప్ హెడ్ లైన్స్

Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
FIFA Rights Scam: ఫిఫా రైట్స్ వెనుక పెద్దల స్కెచ్? హైదరాబాద్ స్టార్టప్‌ను ముంచేసిన అమెరికా మాయగాడు.. రంగంలోకి సీసీఎస్!
ఫిఫా రైట్స్ వెనుక పెద్దల స్కెచ్? హైదరాబాద్ స్టార్టప్‌ను ముంచేసిన అమెరికా మాయగాడు.. రంగంలోకి సీసీఎస్!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget