అన్వేషించండి

CCTV Caught Thefts: దొంగలను పట్టించిన సీసీ టీవీలు, ఎలా అంటే?

CCTV Caught Thefts: హర్యానా నుంచి వచ్చి ఇటీవలే డబ్బులు పెట్టిన ఓ ఏటీఎంను కొల్లగొట్టాలనుకున్నారు. ముహూర్తం చూసుకొని మరీ దొంగతనానికి విఫల యత్నం చేశారు. సీసీకెమెరాల ఆధారంగా పోలీసులకు చిక్కారు. 

CCTV Caught Thefts: రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర  దొంగల ముఠా సభ్యులను చెన్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా ఉత్తర భారతానికి చెందిన వివిధ వృత్తుల్లో ఉన్న యువకులని పోలుసులు తెలిపారు. అయితే తమ స్వస్థలాలలో దొంగతనం చేస్తే పట్టుబడతామని, అందరికీ తెలిసి పోతామని భయంతో.. దొంగతనాల కోసం దక్షిణ భారత దేశాన్ని ఎంచుకున్నారని అన్నారు. ఒకేసారి ఏటీఎంలను లూటీ చేయడం ద్వారా లక్షాధికారులు అయిపోవాలని ప్లాన్ చేసినట్లు వివరించారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలో ఏటీఎం లూటీ చేయడానికి ప్రయత్నించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తులను పట్టుకోవడంలో సీసీటీవీల ప్రాముఖ్యత మరోసారి ఈ సంఘటన ద్వారా నిరూపితమైంది.

నేరం జరిగిన విధానం...

ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి చెన్నూర్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలోకి చొరబడి దొంగతం చేయడానికి ప్రయత్నిచారు. అయితే పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. ఏటిఎం మెషిన్ ని పగలగొట్టడం వారివల్ల కాలేదు. ఇక ఎవరైనా గుర్తిస్తారేమో అనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే దొంగతనానికి ప్రయత్నం జరిగిందనే విషయాన్ని గుర్తించిన ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ నితిన్ పోలీసులకు వెంటనే  ఫిర్యాదు చేయగా... 17వ తేదీ రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును కూడా ప్రారంభించారు. నేర సమయంలో ఏటీఎంలో 20 లక్షల రూపాయలు ఉన్నాయని బ్యాంక్ మేనేజర్ పోలీసులకు వివరించడమే కాకుండా ఏటీఎంని పగ లగొట్టే ప్రయత్నం చేసిన దొంగల విషయాన్ని కూడా పోలీసులకు స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్.. సిబ్బందతో సహా చుట్టుపక్కల ఉన్న కెమెరాలను వివిధ కోణాల్లో పరిశీలించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న పలువురు వ్యక్తులను కూడా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

ఐదుగురు నిందితుల్లో...

వసీం... మనీష్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడగా.. మరో ముగ్గురు నిందితులు తమ స్వరాష్ట్రానికి పారి పోయారు. పారిపోయిన నిందితుల్లో రాహుల్ (42), జహీద్ (20 ), జంషీద్ ఖాన్(28 ) ఉన్నారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు అరెస్టయిన నిందితుల వద్ద లభించడంతో... ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాళ్లను కూడా త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. గతంలో మాదిరిగా దొంగతనానికి పాల్పడి తిరిగి ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు... ఆ సొమ్ము ఉపయోగించాలని అనుకున్నారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిపై ఉన్న పాత రికార్డుల ఆధారంగా గతంలో ఏమైనా కేసులు నమోదు అయ్యాయా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఇన్స్పెక్టర్ టి ప్రవీణ్ కుమార్, ఎస్సై చంద్రశేఖర్, పీసీ మల్లేష్, హెచ్.జి. సదాశివ్, రమేష్ బృందాన్ని మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్... జైపూర్ ఏసీపీ నరేందర్ అభినందించారు. ఇలాగే చాకచక్యంగా వ్యవహిరిస్తూ భవిష్యత్తులో రాబోయే కేసులను ఛేదించాలని సూచించారు. వీలైతే నేరాలు జరగకుండా చూడాలని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget