అన్వేషించండి

Bhadradri Kottagudem News : లవర్ ను గర్భవతి చేసిన యువకుడు, అబార్షన్ వికటించి యువతి మృతి

Bhadradri Kottagudem News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రేమించిన యువతికి అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడో యువకుడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రితో కుమ్మక్కు అయి వ్యవహారం నడిపించాడు. అయితే అబార్షన్ వికటించి యువతి మృతిచెందింది.

Bhadradri Kottagudem News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో ఓ యువతికి అబార్షన్ చేసేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే వైద్యం వికటించడంతో యువతి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిని మూసివేయాలని డిమాండ్ చేశారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబసభ్యులు సురక్ష ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యువతి మృతికి కారణమైన యువకుడు,వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి బంధువులు డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది? 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని సురక్ష ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ వికటించి విద్యార్థిని మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం వీకే. రామవరం గ్రామానికి చెందిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఓ యువకుడు ట్రాప్ చేసి గర్భవతి చేశాడు. గర్భం దాల్చిన విద్యార్థినిని అబార్షన్ చేయించేందుకు ఎవరికీ తెలియకుండా ఆ యువకుడు శుక్రవారం భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో జాయిన్ చేయించాడు. 

ప్రియుడు పరారీ 

ఐదు నెలల గర్భవతి కావడంతో అబార్షన్ చేయడం వల్ల అమ్మాయి పరిస్థితి విషమంగా మారి మృతి చెందింది. విషయం తెలిసి ఆసుపత్రికి తీసుకొచ్చిన యువకుడు పరారైయ్యాడు. అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులు డయల్ 100 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. యువకుడి పేరు భుక్యానంద అని తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రియుడు భూక్యా నంద  కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

ఏటా 73 మిలియన్ల అబార్షన్లు 

భారత్ లో ముందస్తు జననాలు, శిశు మరణాలకు అబార్షన్లు కారణమవుతున్నాయని ఓ సర్వేలో తేలింది. కుటుంబ నియంత్రణకు అబార్షన్‌ను ఉపయోగించడంతో 62% ముందస్తు జననాలు, శిశు మరణాలు పెరుగుతున్నాయని సర్వే నివేదిక తెలుపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 73 మిలియన్ల అబార్షన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. భారతదేశంలో అబార్షన్ రేటు 15-49 సంవత్సరాల వయసు గల వెయ్యి మంది మహిళలకు 49గా ఉందని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. బలవంతపు అబార్షన్లు ముందస్తు జనన ప్రమాదాన్ని 25–27 శాతం పెంచుతోందని సర్వేలో తేలింది. వివిధ కారణాలతో మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంభిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తెలిపింది. కుటుంబ నియంత్రణకు పట్టణాల్లో మహిళలు సురక్షిత చర్యలు తీసుకుంటునప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మాత్రం కుటుంబ నియంత్రణ పేరుతో అబార్షన్ లకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 

Also Read : హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో దారుణం- నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Embed widget